ఆమె టీచర్.. వీడు డ్రైవర్.. నమ్మించి సహజీవనం చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..

| Edited By: Shaik Madar Saheb

Jul 30, 2024 | 4:10 PM

అది అనకాపల్లి జిల్లా.. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది ఆమె. అదే స్కూల్లో బస్సు డ్రైవర్ గా మరొకడు. మెల్లగా ఆమెను ట్రాప్ చేశాడు.. లోబర్చుకున్నాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి వదిలించుకోవాలనుకున్నాడు. పక్కా ప్లాన్ చేసి అతి కిరాతకంగా చంపేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

ఆమె టీచర్.. వీడు డ్రైవర్.. నమ్మించి సహజీవనం చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..
Crime News
Follow us on

అది అనకాపల్లి జిల్లా.. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది ఆమె. అదే స్కూల్లో బస్సు డ్రైవర్ గా మరొకడు. మెల్లగా ఆమెను ట్రాప్ చేశాడు.. లోబర్చుకున్నాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి వదిలించుకోవాలనుకున్నాడు. పక్కా ప్లాన్ చేసి అతి కిరాతకంగా చంపేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.. అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపిక ప్రకటించిన వివరాల ప్రకారం.. కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 19, 2017లో ఘటన జరిగింది. హత్య కేసులో నిందితుడు రెడ్డం నరేష్ కుమార్ (35) పాయకరావుపేట లో నివాసం ఉంటున్నాడు.. శ్రీ ప్రకాష్ స్కూల్ లో బస్ డ్రైవర్ గా పని చేసేవాడు. అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న సూరపు ఇందిర తో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కొంతకాలం పాటు సహజీవనం చేసాడు. ఇందిర పెళ్లి కోసం ప్రస్తావన తేవడంతో.. ముఖం చాటేసి ప్రయత్నం చేశాడు. తీవ్రంగా ఒత్తిడి తేవడంతో ఆమెను అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు నరేష్ కుమార్.

ఈ క్రమంలోనే.. మార్చి 19, 2017న కన్నూరుపాలెంలో గల రాజు గారి లేఔట్ వద్దకు ఆమెను తీసుకెళ్లాడు.. అనంతరం ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు.. బ్లేడుతో గాయపరిచి.. పెట్రోల్ పోసి తగలబెట్టి అతి కిరాతకంగా చంపేసాడు. వీఆర్వో అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదులతో.. కేసు నమోదు చేసిన కసింకోట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి సీఐ రామచంద్రరావు నేతృత్వంలో పోలీసులు.. నిందితుడు నరేష్ కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు పంపించారు. ఆధారాలను సేకరించి చార్జీషిట్ ను కోర్టులో ఫైల్ చేశారు.

అనకాపల్లి, 10వ అదనపు జిల్లా కోర్టులో వాద ప్రతి వాదనలు జరిగిన తర్వాత కేసులోని నిందితుడికి.. అనకాపల్లి జిల్లా జడ్జి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, పది వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ హత్య కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వడ్డాది వెంకటరావు వారి వాదనలు సమర్థిస్తూ గౌరవ 10వ అదనపు జిల్లా జడ్జి కోర్ట్, అనకాపల్లి.. ఈ తీర్పును వెల్లడించారని చెప్పారు ఎస్పీ దీపిక. అప్పటి కేసు దర్యాప్తు అధికారి అనకాపల్లి రూరల్ సీఐ జి.రామచంద్రరావు, వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వడ్డాది వెంకటరావు, కశింకోట పోలీసు సిబ్బందిని, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచిన కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని, నిందుతుడికి శిక్ష పడే విధంగా దర్యాప్తు నిర్వహించిన అధికారులను ఎస్పీ అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..