Prathipati Pulla Rao: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు.. వేడెక్కిన ‘పేట’ రాజకీయం
టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు అందడంతో టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
Prathipati Pulla Rao – SC, ST atrocity case: గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కులం పేరుతో దూషించారని ప్రభుత్వ ఉద్యోగిని నుంచి ఫిర్యాదు అందడంతో టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రత్తిపాటి పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3 గా బండారుపల్లి సత్యానారాయణ, ఏ4గా శ్రీనివాసరావును కేసులో చేర్చారు. ఈ మేరకు 323,34,353,506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు అందింది. కాగా.. చిలకలూరిపేటలోని మంచినీటి చెరువు దగ్గర నిన్న ఈ ఘటన జరిగింది.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ సుజల స్రవంతి పధకాన్ని ప్రారంభించేందుకు చిలకలూరిపేటకు వచ్చారు. అయితే ఎన్టీఆర్ సుజల పధకానికి అనుమతి లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవం చేయకుండా పుల్లారావు పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు – టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
Also Read: