Guntur GGH: అయ్యో పాపం.. వైద్యం వికటించిన చిన్నారి ఆరాధ్య మృతి.. చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్

కంటి కింద కణితి తొలగించాలని తల్లీదండ్రులు ఆరాధ్యను గుంటూరు ప్రభుత్వ (జీజీహెచ్‌) ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. శస్త్ర చికిత్స చేసిన తర్వాత ఆరాధ్య పరిస్థితి విషమించింది.

Guntur GGH: అయ్యో పాపం.. వైద్యం వికటించిన చిన్నారి ఆరాధ్య మృతి.. చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్
Ggh Guntur
Follow us

|

Updated on: May 14, 2022 | 10:39 AM

Guntur Government Hospital: తమ పాప కంటిపై కురుపు వచ్చిందని.. తొలగించాలని ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కానరాని లోకాలకు పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ పాప పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లాలోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరాధ్య (12) శనివారం ఉదయం మృతి చెందింది. కంటి కింద కణితి తొలగించాలని తల్లీదండ్రులు ఆరాధ్యను గుంటూరు ప్రభుత్వ (జీజీహెచ్‌) ఆసుపత్రిలో చేర్పించారు. అయితే.. శస్త్ర చికిత్స చేసిన తర్వాత ఆరాధ్య పరిస్థితి విషమించడంతో.. ఆమెను వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేశ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వెంటిలేటర్‌కే పరిమితమైన ఆరాధ్య.. శనివారం 8 గంటల ప్రాంతంలో మరణించిందని వైద్యులు తెలిపారు. కాగా.. జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వారం క్రితం ప్రచురితమైన వార్తా కథనాల నేపథ్యంలో.. ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది.

అసలేమైందంటే..?

గుంటూరు.. నగర శివారు అంకిరెడ్డిపాలానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతుల కుమార్తె ఆరాధ్య (12). తమ పాపకు కంటి కింద చిన్న కణితి ఏర్పడటంతో దానిని తొలగించేందుకు జీజీహెచ్‌ వైద్యులను సంప్రదించారు. అయితే.. శనివారం చిన్నారికి చికిత్స చేసి.. కణితి తొలగిస్తామని వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. ఆపరేషన్‌కి తీసుకెళ్లేప్పుడు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి.. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా మారింది. దీంతో తల్లిదండ్రులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్యుల వల్లే తమ పాప పరిస్థితి ఇలా అయిపోయిందంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

Also Read:

Delhi Fire Accident: ఢిల్లీ దుర్ఘటనలో 27 మంది సజీవ దహనం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..