AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ దోశ కేవలం 2 రూపాయలే..! ప్రతి రోజూ క్యూ కడుతున్న జనం

అనంతపురంలోని తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ గత 35 ఏళ్లుగా రూ.1-2కే రుచికరమైన దోశలు విక్రయిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. పావలాకు మొదలుపెట్టి, పెరిగిన ధరలను పట్టించుకోకుండా, ఇప్పటికీ తక్కువ ధరకే దోశలు అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాభాపేక్ష లేకుండా సేవ చేయాలనే ఆమె తత్త్వం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

అక్కడ దోశ కేవలం 2 రూపాయలే..! ప్రతి రోజూ క్యూ కడుతున్న జనం
Dosha
Nalluri Naresh
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 5:34 PM

Share

రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో ఏకంగా రూపాయి, రెండు రూపాయలకే అక్కడ రుచికరమైన దోశలు లభిస్తున్నాయి. ఒక్క పూట టిఫిన్ చేయాలంటేనే రూ.70 నుంచి రూ.80 ఖర్చవుతున్న ఈ రోజుల్లో, ముఖ్యంగా ఒక దోశ తినాలంటే రూ.50 లేనిది ఏ హోటల్లో దోశ దొరకడం లేదు. అలాంటిది గడిచిన 35 ఏళ్లుగా ఓ అవ్వ పావలా నుంచి దోసెలు ఇవ్వడం మొదలుపెట్టి ఇవాళ రూపాయి, రెండు రూపాయలకే దోశలు ఇస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ 1985 నుంచి హోటల్ నడుపుతూ కేవలం దోశలు మాత్రమే అమ్ముతుంది. అప్పట్లో ఒక దోశ పావలా. ఆ తర్వాత అర్ధ రూపాయి చొప్పున దోసెలు ఇచ్చింది.

గడచిన 15- 20 ఏళ్లుగా వంట నూనెలు, పప్పులు, గ్యాస్, బియ్యం ధరలు ఎంత పెరిగిన సావిత్రమ్మ మాత్రం తన దోసె రేటు పెంచలేదు. సావిత్రమ్మ ఇప్పటికి దోసెలు వేస్తుంది. ఇటీవలే రూపాయికి దోసె గిట్టుబాటు కాకపోవడంతో దోశ రేటు రెండు రూపాయలకు పెంచింది. దిగువ మధ్యతరగతి పేదలు తాడిపత్రిలో ఎక్కువగా సావిత్రమ్మ వేసే దోసెల కోసం క్యూ కడుతున్నారు. కట్టెల పొయ్యి మీద వేస్తున్న చిట్టి దోశలు రుచికరంగా ఉండడంతో పాటు రెండు రకాల చట్నీలు కూడా సావిత్రమ్మ ఇస్తుండడం. అది రూపాయి రెండు రూపాయలకే ఒక దోశ ఇస్తుండడంతో ఆమె ఎంతో ఇష్టంగా గత కోనేళ్లుగా తింటున్నామంటున్నారు స్థానికులు.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం రోజుకి 200 నుంచి 300 రూపాయలు అన్ని ఖర్చులు పోగా మిగిలితే చాలు అన్న ఉద్దేశంతో సావిత్రమ్మ రూపాయి రెండు రూపాయలకే దోసెలు ఇచ్చి పేదల ఆకలిని తీరుస్తుంది అంటున్నారు స్థానికులు. ఒక రోజుకు దాదాపు 500 చిట్టి దోశల వరకు అమ్ముడు పోతాయి అంటున్నారు సావిత్రమ్మ. తన ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం ఇలా రూపాయి, రెండు రూపాయలకే దోసెలు ఇస్తానని, ఇంకా ధరలు పెరిగితే ఇక దోసెల హోటల్ తీసేస్తానంటున్నారు సావిత్రమ్మ. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దోసె ధర పావలా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు రూపాయి ధర వరకు దోసెలు అమ్ముకొని, తన ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేశారు సావిత్రమ్మ.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. వీరికి మాత్రమే ఛాన్స్..
సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. వీరికి మాత్రమే ఛాన్స్..
ఇంద్రుని తోటలోని ఈ మొక్క మీ ఇంటి అదృష్టాన్ని మార్చివేస్తుంది..!
ఇంద్రుని తోటలోని ఈ మొక్క మీ ఇంటి అదృష్టాన్ని మార్చివేస్తుంది..!
ఏ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత?
ఏ పథకంలో అత్యధిక వడ్డీ రేటు ఉంది? మీరు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత?
అప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి ఇంటికి పని చేశాడు.. ఇప్పుడు
అప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి ఇంటికి పని చేశాడు.. ఇప్పుడు
హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు..
హైదరాబాద్ నుంచి బాలికి 5 రోజుల అదిరిపోయే టూర్.. పూర్తి వివరాలు..
చికెన్ పచ్చడి పక్కా కొలతలు గ్రాములతో సహా..
చికెన్ పచ్చడి పక్కా కొలతలు గ్రాములతో సహా..
బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్
బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్
తేలు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
తేలు గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?