రాయలసీమ గడ్డపై సిద్ధమవుతున్న పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్..!

పులివెందుల ప్రాంతం సంక్రాంతి నాటు కోళ్ల ఎగుమతికి ప్రధాన కేంద్రంగా మారింది. కోడి పందాల కోసం ప్రత్యేకంగా పెంచే ఈ కోళ్లకు భారీ డిమాండ్ ఉంది. సెలమ్, భీమవరం జాతి కోళ్లను ప్రత్యేక ఆహారంతో (మాంసం, గుడ్లు, బాదం) పోషిస్తున్నారు. ఒక్కో కోడి లక్ష రూపాయల వరకు పలుకుతూ, రైతులు, పెంపకందారులకు లక్షల రూపాయల ఆదాయం అందిస్తోంది. ఇది సంక్రాంతి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.

రాయలసీమ గడ్డపై సిద్ధమవుతున్న పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్..!
Pulivendula Native Chickens

Edited By:

Updated on: Dec 26, 2025 | 12:14 PM

పులివెందుల ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు నాటు కోళ్లు ఎగుమతి అవుతున్నాయి. సంక్రాంతి పండుగ రావడంతో నెలరోజుల ముందు నుంచే అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు గుర్తుకొస్తాయి. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తూ, సంక్రాంతి పండుగకు తమ సొంత గ్రామాలలో సరదాగా కోడిపందాలు నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి కోళ్లను తెచ్చి పులివెందుల ప్రాంతంలో పెంచుతున్నారు. ఆరు నెలల కోడి పిల్లలు తీసుకొని వచ్చి వాటికి ప్రత్యేక ఆహారం అందిస్తూ అనేక జాగ్రత్తలతో నాటుకోళ్లను పెంచుతున్నారు. పులివెందుల ప్రాంతంలో 20000 నుంచి 50 వేల రూపాయలకు కోడి కొనుగోలు చేసి పెందెంలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

పందెం కోళ్ల పోషణ-

నాటు కోళ్లను ఆరు నెలల పిల్లలప్పటి నుంచి ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. మూడు నెలల పాటు చిరుధాన్యాల తో పోషించి వాటికి ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి పెంచుతున్నారు. వీటికి నెలరోజుల ముందు నుంచి మటన్, ఉడకపెట్టిన గుడ్డు, బాదంపప్పు, పిస్తా ఇలా ఖరీదైన ఆహారాన్ని వాటికి తినిపిస్తూ వాటిని ప్రత్యేకంగా చూసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

వివిధ ప్రాంతాల నుంచి పందెం కోళ్ల-

పులివెందుల ప్రాంతంలో పందెం కోళ్ళను రెండు రకాలుగా గుర్తిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సేలం, దిండిగల్. ఈ రెండు ఇలా పలు ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి పెంచుతున్నారు. భీమవరం జాతికి చెందిన పలు పుంజులను కూడా ఇక్కడ చిన్నపిల్లలను తీసుకొని వచ్చి పెంచుతున్నారు.

తమిళనాడు, భీమవరం కోళ్ల మధ్య వ్యత్యాసం-

తమిళనాడుకు చెందిన కోళ్లు ఎక్కువ ఎత్తుకు ఎగిరి పోట్లాడుతాయి. అలాగే వీటిని పందెం నిర్వహించే నిర్వాహకులు ప్రతిసారి వాటిని తమ చేతుల్లోకి తీసుకొని బరిలోకి దింపుతూ ఉంటారు. వీటిని ఇడుపుడు పందెం అని పిలుస్తారు. అయితే ఈ పందెం చూసేందుకు నిర్వాహకులతో పాటు జనానికి కూడా ఉత్కంఠ గా ఉంటుంది.

అలానే భీమవరం జాతికి చెందిన కోళ్లు వాటికి ఎంత గాయాలైన ఏం జరిగినప్పటికీ కోడిని నిర్వాహకులు పట్టుకోరు. రెండు కోళ్ల మధ్య జరిగే పందెంలో ఏదో ఒకటి తుదిశ్వాస విడిచేంతవరకు ఈ పందెం నిర్వహిస్తారు.

వీడియో ఇక్కడ చూడండి…

నాటు కోళ్ల తో ఆదాయం-

ప్రస్తుతం మార్కెట్లో నాటు కోళ్లది ప్రత్యేక స్థానం. ఎందుకంటే నాటు కోళ్లను కొనుగోలు చేయడానికి సంక్రాంతి పండగే కాకుండా మిగతా సమయాల్లో కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. మామూలుగా తినే నాటుకోడి ప్రస్తుతం కేజీ 1000 పలుకుతుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పందెం కోళ్ళ విషయానికి వస్తే సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచే పందెం కోళ్లకు డిమాండ్ ఎక్కువ. ఒక్కొక్క కోడి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతుంది. పల్లెల్లో నాటు కోళ్లు ఉండడం సర్వసాధారణం కానీ, ఇప్పుడు ఇదొక ఆదాయ వనరుగా మారింది. మంచి రాబడి ఉండటంతో ప్రత్యేకంగా పందెం కోళ్లను సైతం స్పెషల్ కేర్‌ తీసుకుంటూ ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి వాటిని పెంచుతున్నారు. ఖర్చు ఎంత అయినప్పటికీ వారు వెనకడుగు వెయడం లేదు. ఇప్పుడు బయట ప్రాంతాల నుంచి కూడా పందెం నిర్వాహకులు, ప్రజలు ఎక్కువగా వచ్చి ఇక్కడ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి చిన్న కుటుంబానికి కూడా సంక్రాంతి పండుగకు లక్ష రూపాయల మేర లాభం వస్తుందని ప్రతి ఒక్కరూ పందెం కోళ్లను పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..