Kodi pandalu: అప్పుడే మొదలైన సంక్రాంతి సందడి.. కోళ్ల పందానికి ఈసారి కోట్లేనట!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది గాలిపటాలు, కోడి పందాలు, తెలంగాణలో గాలిపటాలు, ముగ్గుల పోటీలతో సందడి వాతావరణం నెలకొంటే.. అటు ఏపీలో మాత్రం కోడి పందాల బరిలో కనిపిస్తుంది. ఇక పండగకు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏపీలో పందెం రాయుళ్లు కోడి పందాలకు సిద్దం అవుతున్నారు.

Kodi pandalu: అప్పుడే మొదలైన సంక్రాంతి సందడి.. కోళ్ల పందానికి ఈసారి కోట్లేనట!
Andhra News

Edited By:

Updated on: Dec 16, 2025 | 2:51 PM

గోదావరి జిల్లాల్లో సంక్రాతి పండుగ సందడి అప్పుడే మొదలైంది. పందెం రాయుళ్లు కోడి పందాలకు సిద్దం అవుతున్నారు. ఈ సారి కోట్లలో పందాలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి. ఎవరు ఎవరు సిండికేట్ గా ఉండాలి, వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి, పందాలు నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. పందెం రాయుళ్లును ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయోగాలు, బహుమతులు ఏర్పాటు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే కోడిపందాలుకు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, రాయలసీమ, తో పాటు కొంతమంది ఇతర దేశాల నుండి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ పుల్ జోష్ మీద ఉంటాదని అంచనా వేస్తున్నారు. పందాలు కోసం కోడి పుంజులను రెడీ చేస్తున్నారు. సంవత్సరం నుండి మకాంలలో పందెం పుంజులను బలిష్టంగా తయారుచేస్తున్నారు. బాదం, జీడిపప్పు, కోడిగుడ్డు, వేట మాంసం, ఆకుకూరలు వేసి బలంగా మేపుతున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయిస్తున్నారు. పందెం సమయంలో కోడి పుంజులకు గస రాకుండా ఉండేందుకు నీటి తొట్టెలో ఈత కొట్టిస్తున్నారు.

కోళ్ళను పెంచలేని పందెం రాయుళ్లు మంచి జాతి పుంజులను మకాం దగ్గరకు వెళ్ళి పోటీ పడి మరీ కొంటున్నారు. గట్టిగా పోరాడే పుంజుల రేట్లు మామూలుగా లేవు. జాతి పుంజులు ఒక్కొక్కటి యాబై వేల నుండి రెండు లక్షలు వరకూ అమ్ముడుపోతున్నాయి. గత సంవత్సరం వైరెస్ , వ్యాధులతో కోళ్ళు మృత్యువాత పడ్డాయి. అందువల్ల ఈ సంవత్సరం వీటి డిమాండ్ బాగా పెరిగింది. భీమవరం, ఉండి, కాళ్ళ, వీరవాసరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని హోటల్ అన్ని పండగ పేరు చెప్పి అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఈ సంక్రాంతికి కోట్లలో పందాలు జరగడం ఖాయం. రూ .10, 25, 50 లక్షలు, కోటి రూపాయలు పందాలు వేసేందుకు సిద్దం అవుతున్నారనే ప్రచారం పందెం రాయుళ్లు నుంచి వినిపిస్తుంది. ఏ సమయంలో ఏ పందెం వెయ్యాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో ఎలాంటి పుంజులను వదలాలి అనేది కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా కోళ్ళు రంగులు, జాతిని బట్టి పందాలు వేస్తారు. ఇప్పటికే కొంతమంది పందెం రాయుళ్లు కుక్కుటశాస్త్రాన్ని పాటించడం మొదలుపెట్టారు. గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు జోష్ తో ఈ సారి సంక్రాంతి మరింత సందడిగా మారనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.