Sanchaita: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం గజపతుల కుటుంబంలో వివాదాన్ని ఇంకా రాజేస్తోంది. తాజాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై మాజీ చైర్ పర్సన్ సంచయిత సంచలన కామెంట్స్ చేశారు. మాన్సస్ కార్యాలయం వద్ద నెలకొన్ని వివాదం నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన సంచయిత.. అశోక్ గజపతి రాజు పై హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈవో ని బెదిరించడానికి సిబ్బందిని ప్రేరేపించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానినంచారు. మీ అన్నయ్య ఆనంద గజపతి రాజు జన్మదినం రోజున ఇలాంటి కార్యక్రమాలకు ప్రేరేపించడం మీకు సిగ్గుగా లేదా? అంటూ అశోక్ గజపతి రాజును ప్రస్తావిస్తూ సంచయిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదిలాఉంటే.. తమకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలంటూ మాన్సస్ కార్యాలయాన్ని ట్రస్ట్ ఉద్యోగులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో మాన్సస్ ఈవో వెంకటేశ్వరరావు ను దాదాపు రెండు గంటలుగా నిర్బంధించారు. తమకు పదహారు నెలలుగా జీతాలు నిలిపివేయడం అన్యాయం అని ఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో వ్యవహారంతోనే తమ జీతాలు నిలిచిపోయాయని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, ఉద్యోగుల ఆందోళనతో అలర్ట్ అయిన కార్యాలయ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మరోవైపు.. మాన్సస్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి, దివంగత నాయకులు ఆనంద గజపతిరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సుధా, ఊర్మిల గజపతిరాజు నివాళులర్పించారు. ఆయన సమాధి వద్ద పుష్ఫగుచ్చాలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఊర్మిళ గజపతిరాజు.. సింహాచలం భూముల వ్యవహారం విషయంలో ఏం జరుగుతుందో తమకు తెలియదన్నారు. తాను కూడా అందరిలాగే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని పేర్కొన్నారు. మాన్సస్ ట్రస్ట్ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందన్నారు. ఈ వివాదం ముగింపు కోసం అందరి మాదిరిగానే తానూ ఎదురుచూస్తున్నానని అన్నారు. మాన్సస్ సంస్థలో తన తండ్రి చైర్మన్ గా ఉన్న సమయంలో ఆడిట్ జరిగినట్లు సమాచారం ఉందని, ఆయన తర్వాత ఎం జరిగిందో తెలియదని పేర్కొన్నారు.
Sanchaita Tweet:
On the day of your elder brothers birth anniversary it is shameful that you are instigating the staff to intimidate the Mansas EO who is a Govt servant hiding behind the Correspondent. Shame on you @Ashok_Gajapathi pic.twitter.com/nDifOslylJ
— Sanchaita Gajapati (@sanagajapati) July 17, 2021
Also read:
Hyderabad: ‘మరో మహిళతో మీ భర్త’ అంటూ ఆమె చెప్పిన ఒక్క మాట.. ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది..
Fire Accident: రన్నింగ్‌లో ఉన్న లారీకి ఒక్కసారిగా అంటుకున్న మంటలు.. ఆ తరువాత చూస్తుండగానే..