ఆంధ్రప్రదేశ్(Andhra Pradsh) రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందించారు. లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ హస్తం ఉండటం వల్లే ఆయనను పోలీసులు అరెస్టు చేశారన్నారు. విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న వారినే ప్రభుత్వం అరెస్టు చేసిందని స్పష్టం చేశారు. కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని మాఫియా ముఠాలా మారాయని సజ్జల ఆరోపించారు. నారాయణ అరెస్టులో రాజకీయ కక్ష సాధింపు ఏమీ లేదని చెప్పారు. నారాయణ(Narayana) సహా మరిన్ని విద్యా సంస్థలు ఫ్యాక్టరీల్లా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గవర్నర్‌కు చంద్రబాబు లేఖలు రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. వీరి విద్యాసంస్థల వెనుక చంద్రబాబు కూడా ఉన్నారా.. అనేది అర్థం కావడం లేదని సందేహించారు. నారాయణ విద్యా సంస్థల విద్యార్థులను వంద శాతం ఉత్తీర్ణులను చేసేందుకే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. విద్యాసంస్థల ఛైర్మన్ కానప్పటికీ.. లీకేజీ వ్యవహారంలో నారాయణ పాత్ర ఉందని తేలితే ఆయన నిందితుడు అవుతాడని సజ్జల కుండబద్దలు కొట్టారు.
పరీక్షల నిర్వహణలో లీకేజీ వంటి నేరాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తామని సజ్జల అన్నారు. నారాయణ బెయిల్‌పై పైకోర్టుకు పోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న సజ్జల.. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే నేరుగా చంద్రబాబునే అరెస్టు చేసేవాళ్లం. ఇలాంటివి రిపీట్ చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. లీకేజీ వ్యవహారంలో ప్రమేయమున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటికే అరెస్టు చేశామని, ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలితే ఎంతటివారినైనా ప్రభుత్వం వదలిపెట్టదని స్పష్టం చేశారు.
నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు. ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని తెలంగాణ పోలీసులకు చిత్తూరు పోలీసులు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
PM Narendra Modi: అర్హత లేని వారికి ప్రభుత్వ పథకాలు.. ఆవేదన వ్యక్తంచేసిన ప్రధాని మోడీ
సీనియర్ జర్నలిస్ట్ సి.నరసింహరావు కన్నుమూత.. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస