పర్యాటకులారా తస్మాత్ జాగ్రత్త.. మూలపాడు పార్కులోని జిప్ లైన్ ప్రాణాలకే ప్రమాదం?
NTR district butterfly park safety issues: ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక్క చిన్న తప్పు.. చాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉందని పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. చిన్న సంఘటనగా మిగలదు. విషాదంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లోని సీతాకోకచిలుకల పార్క్. బయటకు చూస్తే అందమైన ప్రకృతి. కానీ, లోపల మాత్రం… భద్రతా లోపాలతో పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. జిప్ లైన్ పేరుతో అడ్వెంచర్ అందిస్తున్నామని చెబుతున్నా.. అక్కడ కనిపిస్తున్నది మాత్రం రక్షణ లేని ప్రాణాలతో చేసే ప్రమాదకర ప్రయోగం.
అడ్వెంచర్ పేరుతో ప్రాణాలతో ఆటలాడుతున్నారు..అజాగ్రత్తకు మరో పేరు అవుతుంది ఆ పార్క్. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లోని సీతాకోకచిలుకల పార్క్ ను ఇటీవల అటవీశాఖ అభివృధి చేపడుతుంది బయటకు చూస్తే అందాల ఆవరణ.. కానీ లోపల మాత్రం ప్రమాదాల గూడు అన్నట్టుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిప్ లైన్ అనే అడ్వెంచర్ ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.
ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక్క చిన్న తప్పు.. చాలు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉందని పర్యాటకులు భయంతో వణికిపోతున్నారు. ప్రకృతి మధ్యలో సేదతీరాలని వచ్చిన పర్యాటకులకు ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి ప్రమాదం వెంటాడుతోందనే అనుభూతి కలుగుతోంది.జిప్ లైన్ ప్రారంభమయ్యే ఎత్తైన కొండ ప్రాంతంలో ఒక అడుగు తప్పినా నేరుగా లోతుల్లోకి జారిపోయే ప్రమాదం ఉందని సందర్శకులు చెబుతున్నారు. కానీ అక్కడ రక్షణ కంచెలు లేవు పట్టుకునే హ్యాండ్రైల్స్ లేవు ప్రమాదాన్ని హెచ్చరించే ఒక్క బోర్డు కూడా కనిపించటలేదు. జిప్ లైన్ ఎక్కే ముందు ప్రాణాలను కాపాడే భద్రతా పరికరాలు సరిగా ఉన్నాయా లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయని పర్యాటకులు వాపోతున్నారు. సిబ్బంది సరైన సూచనలు ఇవ్వకపోవడం పర్యవేక్షణ లేకపోవడం పరిస్థితిని మరింత భయానకంగా మారుస్తోంది.
వీకెండ్ రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరే జనసంద్రం.. ఆ హడావిడిలో ఒక్క ప్రమాదం జరిగినా అది చిన్న సంఘటనగా మిగలదు పెద్ద విషాదంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, కుటుంబాలతో వచ్చిన పర్యాటకులు ఆనందంగా గడపాల్సిన చోట.. భయంతో వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పతున్నాయి.
