విశాఖ కూర్మన్నపాలెం సమీపంలో దువ్వాడ రైల్వే స్టేషన్. అక్కడే గౌరీ నగర్ లో తీవ్ర కలకలం రేగింది. చీకటి పడ్డాక ఓ ఇంట్లో నివాసం ఉన్న వారికి వింత శబ్దాలు వినిపించాయి. శ్వాస గట్టిగా తీసుకునేలా ఆ శబ్దాలు. దీంతో ఇంట్లో అంతా చూసారు ఎక్కడా ఏది కనిపించలేదు. శబ్దాలు కొనసాగుతూ ఉన్నాయి. కిటికీ దగ్గర నుంచి ఆ శబ్దాలు మరింత పెరిగాయి. దీంతో ఒక్కసారిగా ఇంటి పక్కనే ఉన్న సందు వైపు వెళ్లి చూశారు. దీంతో ఓ పాము అక్కడ తిష్ట వేసి కూర్చుంది. శబ్దాలు చేస్తూ భయాందోళనకు గురి చేసింది. దీంతో గుండెలు పట్టుకున్న ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు.. కాలనీలో వాసులకు చెప్పారు. వారంతా వచ్చి చూశారు.
అమ్మో అది అతి భయంకరమైన పాము అని కొంతమంది అనడంతో ఆ చుట్టుపక్కల ఎవరూ వెళ్ళే సాహసం చేయలేదు. దీంతో స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కిరణ్ కుమార్.. భుసలు కొడుతున్న ఆ పామును రెస్క్యూ చేశాడు. ఐదు అడుగుల పైగా పొడవున్న చాకచక్యంగా బంధించాడు. ఈ పాము రక్తపింజర. దీన్నే వైపర్ స్నేక్ కూడా అంటారు. అత్యంత విషపూరిత పాముల్లో ఇదొకటి. కాటు వేస్తే.. క్షణాల్లో శరీరమంతా విషం పాకి ప్రాణం పోక తప్పదట. పామును పట్టుకోగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..