Bus Accident: ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం.. ప్రయాణీకులు సురక్షితం..

|

Jul 02, 2023 | 7:37 AM

బ్రేకులు ఫెయిల్‌ పెద్దశబ్దం వచ్చి.. బస్సు పక్కకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు కంగారు పడిపోయారు. అయితే.. డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సేఫ్‌ అయ్యారు. ఇక.. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్‌ను ప్రయాణికులతోపాటు అధికారులు అభినందించారు.

Bus Accident: ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం.. ప్రయాణీకులు సురక్షితం..
Vsp Bus Accident
Follow us on

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. పాడేరు ఘాట్ రోడ్ రాజపురం వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. దాంతో.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించాడు. కొండగట్టును ఢీకొని ఆగిపోయేలా చేశాడు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉండగా.. అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. బ్రేకులు ఫెయిల్‌ పెద్దశబ్దం వచ్చి.. బస్సు పక్కకు దూసుకెళ్లడంతో ప్రయాణికులు కంగారు పడిపోయారు. అయితే.. డ్రైవర్‌ అప్రమత్తతతో కొండగట్టుకు ఢీ కొట్టి.. బస్సుని నిలువరించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఒకవేళ బస్సు డ్రైవర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ఉండి కంగారు పడినట్లు అయితే ఆ బస్సు పక్కనే ఉన్న సుమారు 60 అడుగుల లోయలోకి బస్సు దూసుకుని పోయి ఉండేదని తెలుస్తోంది. తమకు ప్రాణాపాయం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. గమ్య స్థానం చేరుకోవడనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన తమ ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ను ప్రయాణికులతోపాటు అధికారులు అభినందించారు.

గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు.. ముఖ్యంగా బస్సు ప్రమాద పెరుగుతూనే ఉన్నాయి. వరస బస్సు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..