Andhra Pradesh: ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులు సీజ్..

| Edited By: Ravi Kiran

Jun 15, 2023 | 9:42 AM

ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలలో కంటే ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యా్ర్థులే ఎక్కువగా ఉంటున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా పిల్లల్ని స్కూల్‌కు తీసుకొచ్చేందుకు బస్సలనే వినియోగిస్తున్నాయి. అయితే వాస్తవానికి ప్రైవేట్ స్కూల్ బస్సలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి.

Andhra Pradesh: ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులు సీజ్..
Private School Bus
Follow us on

ఈ మధ్య  ప్రభుత్వ పాఠశాలలో కంటే ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా పిల్లల్ని స్కూల్‌కు తీసుకొచ్చేందుకు బస్సలనే వినియోగిస్తున్నాయి. అయితే వాస్తవానికి ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఇలా లేకుండా.. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ బస్సులను సీజ్ చేసే అధికారం ఆర్టీఏ అధికారులకు ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఏపీలోని విజయవాడలో ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు జరిపారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు.

అలాగే పాఠశాల బస్ డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి, వాహనాల రికార్డులను పరిలీస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 1600 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 400 బస్సులకు కొన్ని పాఠశాల యాజమాన్యాలు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందవలేవని తేల్చారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు బస్సులను సీజ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి