AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: బంగారం బిస్కెట్లు రూ. 5 లక్షలే.. లచ్చిందేవి కోసం లచ్చలు ఇచ్చారు.. కట్ చేస్తే

సామాన్యుడికి అందనంత ఎత్తులో బంగారం ధరలు చుక్కలనంటుతోంది. తులం బంగారం దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది. బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇలా బంగారం ధరలు మండిపోతున్న వేళ, కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా భావించి నకిలీ బంగారాన్ని అంటగట్టి అమాయకులను మోసం చేస్తున్నారు.

Andhra: బంగారం బిస్కెట్లు రూ. 5 లక్షలే.. లచ్చిందేవి కోసం లచ్చలు ఇచ్చారు.. కట్ చేస్తే
Gold
M Revan Reddy
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 17, 2025 | 11:23 AM

Share

ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఏసు.. ఆటోడ్రైవర్‌‌‌‌‌గా జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి అప్పులు చేశాడు. ఈజీ మనీ కోసం జనాలను మోసం చేశాడు. తాజాగా నల్లగొండ పట్టణం దేవరకొండ రోడ్‌లో అనస్వి మెడికల్ షాప్ యజమాని వేముల రాజుకు గత ఏడాది నవంబర్‌లో మహిళతో కలిసి గుర్తు తెలియని వ్యక్తి మందులు కావాలని అడిగాడు. ఈ క్రమంలో రాజుతో ఇద్దరూ మాట.. మాట.. కలిపి పరిచయం చేసుకున్నారు.

తన పేరు రవి అని.. ఒంగోలుకు చెందిన తాను ఇక్కడ బిల్డర్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. తన వద్ద పురాతన బంగారం ఉందని తక్కువ ధరకి ఇస్తానని చెప్పాడు. బంగారు బిస్కెట్‌లోని ముక్క తీసి పరీక్షించుకోమని ఇచ్చాడు. ఆ ముక్కను జువెలర్స్ షాప్‌లో రాజు చెక్ చేయించగా.. ఒరిజినల్ బంగారంగా తేలింది. రెండు రోజుల్లో ఐదు లక్షలు ఇస్తే.. 22 తులాల బంగారం బిస్కెట్ ఇస్తానని నమ్మించారు. దీంతో రాజు ఐదు లక్షల రూపాయలు ఏసుకు ఇచ్చి బిస్కెట్ తీసుకున్నాడు. ఆ బిస్కెట్‌ను జువెలరీ షాప్‌లో చెక్ చేయించగా నకిలీ అని తెలిసింది.

దీంతో మోసపోయానని గ్రహించిన మెడికల్ షాప్ యజమాని రాజు.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దేవరకొండ రోడ్‌లో తనిఖీలు చేస్తుండగా.. ఏసు అనుమానదస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడని డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపాడు. నిందితుడు యేసుపై గతంలో కుషాయిగూడ, నల్గొండలో ఇలా నేరాలు చేయగా, కేసులై.. జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. అయినా తన ప్రవర్తనలో మార్పు రాలేదని.. మళ్లీ ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మరో నిందితురాలు లక్ష్మీ పరారీలో ఉందని, నిందితుడు నుంచి నాలుగు లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.