Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. బయటకు వెళ్తే నిప్పుల వర్షమే..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మరింత పెరగనున్నాయి. ఎండాకాలంలో అత్యంత తీవ్ర వేడి ఉండే రోహిణి కార్తె సోమవారం నుంచి ప్రారంభమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడంతో జూన్ 8 వరకు భరించలేని ఎండలు, ఉక్కపోత ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటగా.. రోహిణి కార్తె ప్రభావంతో మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. బయటకు వెళ్తే నిప్పుల వర్షమే..!
Heatwave

Updated on: May 25, 2026 | 7:20 AM

రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయంటారు. ఎండాకాలంలో అత్యంత భయంకరమైన ఎండలు ఉండేది ఇప్పుడే. ఈ సమయంలోనే భరించలేని ఉక్కబోత, తట్టుకోలేని ఎండలూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎండాకాలంలో హయ్యస్ట్‌ హీట్‌ ఇప్పుడే ఉంటుంది. అలాంటి డేంజర్‌ రోహిణి కార్తె.. ఇవాళ్టి నుంచే ప్రారంభంకాబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. సూర్యుడు సోమవారం రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 8వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. ఈ పక్షం రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయి. వేసవి కాలంలో వచ్చే వేడి గాలులు ఒక ఎత్తు అయితే.. రోహిణి కార్తె సమయంలో మాత్రం మరింత ఎక్కువగాఉంటాయి.. ఈ కాలంలో సూర్య భగవానుడు భగ భగ మండిపోతూ ఉంటాడని పేర్కొంటారు. ఈ పక్షం రోజుల్లో సూర్యుడి తీవ్రత తీవ్ర స్థాయికి చేరుకుని, కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందని పేర్కొంటున్నారు.

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడేలా భానుడి భగభగలు భయపెడుతున్నాయి. చాలాచోట్ల ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటేసి.. 49, 50 డిగ్రీల వైపు దూసుకెళ్తున్నాయి. మరి, ఇప్పుడు రోహిణి కార్తెతో.. ఆ రికార్డు రీచ్‌ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పొద్దున్నే తొమ్మిది గంటల నుంచి భాస్కరుడు తన వేడి సెగలను భూమిపైకి విసురుతున్నాడు. మధ్యాహ్నానికి ఎంత తీవ్రత మరింత పెరుగుతుంది.. ఎండ తీవ్రతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే పదుల సంఖ్యలో జనం వడదెబ్బతో చనిపోయారు. అయితే.. వచ్చే వారం కూడా ఎంత తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇదిలాఉంటే.. నిన్న ఏపీలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలాచోట్ల టెంపరేచర్స్‌ 48 డిగ్రీలు దాటేశాయి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీలు నమోదైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో.. అలాగే పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీలు రికార్డైంది. 17 జిల్లాల్లోని 174 మండలాల్లో 44 డిగ్రీలు దాటాయి. మరో నాలుగైదు రోజులు తీవ్రస్థాయిలో ఎండలు, వడగాలులు

తెలంగాణలో అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అయితే.. వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని .. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us