Anantapur Road Accident: అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. పాలసముద్రం సమీపంలో ఎన్‌హెచ్-44పై గురువారం ఉదయం ఈ ఘటన జరగ్గా.. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో డ్రైవర్ వేగంగా వెళుతున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More:
కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 1,015 కొత్త కేసులు.. ముగ్గురు మృతి