Alert : ఏపీకి భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఆ జిల్లాలకు..మరోసారి ముప్పు తప్పదా..?

పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీకి విపత్తుల నిర్వహణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. 

Alert : ఏపీకి భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఆ జిల్లాలకు..మరోసారి ముప్పు తప్పదా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 12, 2020 | 9:30 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీకి విపత్తుల నిర్వహణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది.  రాష్ట్రంలో రానున్న నాలుగైదు గంటలు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని…కావున ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో అధికారులు కూడా అలెర్టయ్యారు.

Also Read : 

ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా

నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !

పెరిగిన చలి, కరోనాతో తస్మాత్ జాగ్రత్త !