కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,015 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 1,716 మంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,015  కొత్త కేసులు నమోదయ్యాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 8:51 am, Thu, 12 November 20
కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,015 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 1,716 మంది

Telangana Health Bulletin: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,015  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,666 కు చేరింది. 24 గంటల్లో ముగ్గురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,393కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,716 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,35,950కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 40,603 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 47,70,004 కు చేరింది. ( ‘ఛత్రపతి’ రీమేక్‌లో బెల్లంకొండ..!)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 172, ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 80, జగిత్యాల్‌ 18, జనగాం 12, జయశంకర్ భూపాలపల్లి 11, జోగులమ్మ గద్వాల్‌ 10, కామారెడ్డి 13, కరీంనగర్‌ 46, ఖమ్మం 48, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 5, మహబూబ్‌ నగర్‌ 14, మహబూబాబాద్‌ 14, మంచిర్యాల్‌ 25, మెదక్‌ 12, మేడ్చల్ మల్కాజ్‌గిరి 97, ములుగు 12, నాగర్‌ కర్నూల్‌ 21, నల్గొండ 57, నారాయణ్‌పేట్‌ 2, నిర్మల్‌ 15, నిజామాబాద్‌ 25, పెద్దంపల్లి 17, రాజన్న సిరిసిల్ల 16, రంగారెడ్డి 98, సంగారెడ్డి 42, సిద్ధిపేట్‌ 15, సూర్యాపేట 21, వికారాబాద్‌ 14, వనపర్తి 9, వరంగల్‌ రూరల్‌ 14, వరంగల్‌ అర్బన్‌ 41, యాద్రాది భువనగిరి 13 కేసులు నమోదయ్యాయి. (కరోనా సైడ్‌ ఎఫెక్ట్‌లు.. ప్రతి ఐదుగురిలో ఒకరికి..!)