Road Accident: తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు..

Road Accident: తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 35వ మలుపు వద్ద కారు అదుపు తప్పి పిట్టగోడను..

Road Accident: తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు..

Updated on: Jan 02, 2021 | 6:52 PM

Road Accident: తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 35వ మలుపు వద్ద కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నేపథ్యంలో వెంటనే స్పందించిన వాహనదారులు అంబులెన్స్‌కి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరిని అధికారులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గురైన కారు హైదరాబాద్‌కు చెందినదిగా, అందులోని ప్రయాణికులు భాగ్యనగర వాసులుగా గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా, ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా, కారు ప్రమాదానికి గురవడంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

 

Also read:

babies born in India on New Year’s Day: జనవరి 1, 2021న భారత్‌లో జననాల సంఖ్య ఎంతో తెలుసా..? ప్రపంచంలోనే టాప్

No Retirement plan: ఇప్పట్లో ఆ ఆలోచనలేదు.. రిటైర్‌మెంట్‌పై స్పందించిన క్రిస్‌ గేల్‌..