AP News: ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలుండవు.? ఫుల్ క్లారిటీ ఇదిగో

| Edited By: Ravi Kiran

Jan 08, 2025 | 7:48 PM

ఏపీలో విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షల రద్దుపై బోర్డు ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్(BIE) ప్రతిపాదిత విద్యా సంస్కరణలను ప్రజల అభిప్రాయాలు, సూచనలు కోసం బహిరంగంగా ఉంచింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి..

AP News: ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలుండవు.? ఫుల్ క్లారిటీ ఇదిగో
Ap Exams
Follow us on

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పలు సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రారంభించింది. ఇంటర్ కళాశాల విద్యావ్యవస్థలో పలు కీలక మార్పులు తీసుకురానున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొదట సంవత్సరం పరీక్షల తొలగింపు ప్రతిపాదన గురించి వివరించింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలను తొలగించేందుకు ఈ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది ఇంటర్ బోర్డు. ఈ ప్రతిపాదనల ప్రకారం, ఇకపై ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని భావిస్తున్నారు.

సంస్కరణల ఆవశ్యకత..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహాయించి దేశంలోని పలు ప్రసిద్ధ విద్యామండళ్లు ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం లేదు. అత్యధిక కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ప్రవేశానికి ద్వితీయ సంవత్సరం పరీక్షలనే అర్హతగా పరిగణిస్తున్నాయి. ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షల తొలగింపుతో, విద్యార్థులు కీలక అంశాలపై మరింత మక్కువతో పట్టు సాధించి, NEET, JEE వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. CBSE, ఇతర రాష్ట్ర విద్యా మండలిలతో సమానత్వం సాధించేందుకు కూడా ఈ మార్పులు అవసరం అని వివరించింది శుక్లా. అదే సమయంలో సిలబస్, కోర్సుల విషయంలో ప్రతిపాదిత మార్పులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఇంటర్ బోర్డు.

1. మొదటి సంవత్సరం పరీక్షలు:

ఇంటర్మీడియట్ విద్యా మండలి రూపొందించిన సిలబస్, బ్లూప్రింట్ ఆధారంగా జూనియర్ కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారు.

2. రెండో సంవత్సరం పరీక్షలు:

ద్వితీయ సంవత్సరం సిలబస్ ఆధారంగా పబ్లిక్ పరీక్షలు నిర్వహించి, ఫలితాలను విడుదల చేస్తారు.

సూచనలు మరియు అభిప్రాయాల ఆహ్వానం

ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు విద్యావేత్తల నుంచి సూచనలు స్వీకరించేందుకు 2025, జనవరి 26 తేది వరకు గడువు విధించారు.

వెబ్‌సైట్: bieap.gov.in

ఈ-మెయిల్: biereforms@gmail.com

ఈ సంస్కరణలు అమలులోకి వస్తే విద్యార్థుల భవిష్యత్తు మెరుగయ్యే అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశిస్తోంది ఇంటర్ బోర్డు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి