Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ సమయాల్లో మార్పు.. కారణమిదే.!

|

Jun 10, 2023 | 8:47 AM

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్(20833) ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. జూన్ 10వ తేదీన ట్రైన్ సమయాల్లో మార్పులు జరిగాయి.

Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ సమయాల్లో మార్పు.. కారణమిదే.!
Vande Bharat Express
Follow us on

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్(20833) ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. జూన్ 10వ తేదీ ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన ఈ ట్రైన్.. 4 గంటలు ఆలస్యంగా ఉదయం 9.45 గంటలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయల్దేరుతుందని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలే ఈ వందేభారత్ ట్రైన్ ఆలస్యానికి కారణమని.. ప్రయాణీకులు ఇది గమనించాల్సిందిగా ఆయన కోరారు. ఇలా చూసుకుంటే.. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లకు ఈ ట్రైన్ అనుకున్న సమయం కంటే.. ఆలస్యంగా చేరుతుంది. అలాగే సికింద్రాబాద్‌కు సాయంత్రం 5.45 గంటలకు చేరుకుంటుందని తెలుస్తోంది. అటు తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్-విశాఖపట్నం(20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఆలస్యంగా నడుస్తుందని.. విశాఖపట్నానికి అర్ధరాత్రి చేరుకునే ఛాన్స్ ఉంది.