Prisoner commits suicide: చిత్తూరు జిల్లా జైల్లో ఖైదీ ఆత్మహత్య కలకలం రేపింది. జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ప్రవీణ్ కుమార్ (26) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా జి.మడుగుల మండలం రాళ్లపుట్టు గ్రామానికి చెందిన రాధాకృష్ణ కుమారుడు ప్రవీణ్ కుమార్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. గతేడాది జూలైలో తిరుపతిలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా.. తిరుపతి యూనివర్సిటీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో తిరుపతి జైలులో ఉన్న అతడిని అదే నెలలో చిత్తూరులోని జిల్లా ( Chittoor district jail) జైలుకు తరలించారు. ఇటీవల ప్రవీణ్ కుమార్‌కు బెయిల్ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించగా రద్దయినట్లు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత కుటుంబసభ్యులు పట్టించుకోవడంలేదంటూ ప్రవీణ్ కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇదేవిషయంపై పలుమార్లు తోటి ఖైదీలతో చెప్పి బాధపడ్డాడని జైలు అధికారులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్న సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన ప్రవీణ్ కుమార్.. బయటకు రాలేదు. కొంతసేపటి తర్వాత చూడగా.. కిటీకికి వెలాడుతూ కనిపించాడు. వెంటనే ప్రవీణ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని జైలు అధికారులు తెలిపారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: