Andhra: ఒక్క సెకన్ ఆగితే ప్రాణం దక్కేది.. బైక్‌పై వెళ్లేటప్పుడు ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి..

ముఖ్యంగా నిర్లక్ష్యం, నిబంధనలను పాటించకపోవడం, ఏం కాదులే అనే పిచ్చి ధీమా.. ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.. అంతేకాకుండా ప్రాణాలు తీస్తున్నాయి.. అన్నమయ్య రాయచోటిలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోడం కలకలం రేపింది.. ఈ లారీ బైక్ ను ఢీకొట్టిన ఘటనలో బైకర్ చనిపోయాడు.. బైక్, లారీ ఇంజిన్ దగ్దమైంది.

Andhra: ఒక్క సెకన్ ఆగితే ప్రాణం దక్కేది.. బైక్‌పై వెళ్లేటప్పుడు ఇలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకండి..
Rayachoti Road Accident

Edited By:

Updated on: Jan 09, 2026 | 6:02 PM

ఈ మధ్యకాలంలో ఎక్కడపడితే అక్కడ యాక్సిడెంట్లు జరగటం.. అందులో వాహనాలకు మంటలు అంటుకోవడం.. పలువురి ప్రాణాలు పోవడం సర్వసాధారణమైపోయింది.. అసలు వాహనాలు ఎందుకు అంత త్వరగా మంటలు అంటుకుని తగలబడుతున్నాయి అనే విషయంపై క్లారిటీలు లేవు.. అయితే.. ముఖ్యంగా నిర్లక్ష్యం, నిబంధనలను పాటించకపోవడం, ఏం కాదులే అనే పిచ్చి ధీమా.. ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.. అంతేకాకుండా ప్రాణాలు తీస్తున్నాయి.. అన్నమయ్య రాయచోటిలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోడం కలకలం రేపింది.. బైకర్ నిర్లక్ష్యంతో.. బైక్ లారీ రెండు తగలబడ్డాయి.. బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని గాలివీడు రింగ్ రోడ్డు సర్కిల్లో లాజిస్టిక్ కు సంబంధించిన లారీ స్పీడ్ గా వచ్చి రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీకొంది.. లారీ బైక్ ను దాదాపు 20 మీటర్ల దూరం వరకు ఈడ్చుకొని వెళ్ళింది. ఈ సమయంలో బైక్ రోడ్డుకి రాసుకోవడం.. అందులో నుంచి పెట్రోల్ కారడం.. దానికి మంటలు అంటుకోవడం వెంటనే బైక్ పూర్తిగా దగ్ధమైంది.. అయితే, ఈ ప్రమాదంలో ఆ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి… అతనిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఆ వ్యక్తి మార్గ మధ్యలో చనిపోయాడు. వీడియో చూస్తుంటే.. వచ్చేపోయే వాహనాల మధ్య బైకర్ నిర్లక్ష్యంగా రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.

వీడియో చూడండి..

అలాగే మంటలలో చిక్కుకున్న లారీ ఇంజిన్ పార్ట్ మొత్తం కాలిపోయింది. అయితే సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ లాజిస్టిక్ కు సంబంధించిన లారీలో ఏముంది అని పరిశీలించగా అందులో వాహనాలకు అలాగే ఇన్వర్టర్లకు వాడే బ్యాటరీలు ఉన్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

అదే లారీ కనుక పూర్తిగా తగలబడి ఉండుంటే అందులో ఉన్న బ్యాటరీలు పూర్తిగా కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లేదు.. అంతేకాక బ్యాటరీలు ఆ మంటలలో చిక్కుకొని ఉంటే పేలే ప్రమాదం కూడా ఉండేది కాబట్టి చుట్టుపక్కల వారికి కూడా తీవ్ర నష్టం జరిగేది.. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీసులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..