AP Politics: అప్పుడు కయ్యానికి కాలుదువ్వారు.. ఇప్పుడు చేతులు కలిపారు.. వండర్ పాలిటిక్స్ అంటే ఇదే

|

Nov 29, 2021 | 9:20 PM

YSRCP - TDP AP Politics: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు.. నిన్నటికి నిన్న కయ్యానికి కాలు దువ్వినంత పని చేసిన ఇద్దరు నేతలు.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ చేతులు

AP Politics: అప్పుడు కయ్యానికి కాలుదువ్వారు.. ఇప్పుడు చేతులు కలిపారు.. వండర్ పాలిటిక్స్ అంటే ఇదే
Ap Politics
Follow us on

YSRCP – TDP AP Politics: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరంటారు.. నిన్నటికి నిన్న కయ్యానికి కాలు దువ్వినంత పని చేసిన ఇద్దరు నేతలు.. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ చేతులు కలిపారు. అది కూడా ఎప్పుడూ ఘాటైన వ్యాఖ్యలు చేసుకునే వైసీపీ టీడీపీ నేతలు. ఇంతకీ ఎవరా నేతలు.. ఎందుకు పోట్లాడారు… మళ్లీ ఎందుకు కలిశారు. అనేది చూద్దాం.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. ఏదైనా సరే సూటిగా మాట్లాడుతారు.. ఎంతటి వారున్నా సరే తన వాయిస్ వినిపిస్తారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో హైటెన్షన్ రేపిన పెనుకొండ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడి మాజీ ఎమ్మెల్యే పార్థసారధికి – మాధవ్ కి మధ్య గొడవ జరిగింది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాధవ్ అటుగా వెళ్తూ పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. అక్కడే ఉన్న పార్థసారధి దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతే కాదు.. మాధవ్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏయ్, బుద్ధిండాలంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీనికి మాధవ్ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ గొడవ జరిగిన కేవలం రెండు వారాలు తిరగకుండానే ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపారు.

ఆదివారం కనకదాసు జయంతి ఉత్సవాల సందర్భంగా అనంతపురంలో కురుబలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న కురుబ నేతలంతా పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. వైసీపీ నుంచి మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ మాధవ్ ఇతర ముఖ్య నేతలు, టీడీపీ నుంచి పార్థసారధి ఇతర ముఖ్య నేతలు వచ్చారు. మనమంతా ఐక్యంగా ఉండాలంటూ చేతులు కలిపి పైకి ఎత్తారు. ఈ సమయంలో మాధవ్ మంత్రితో ఏదో చెప్పి.. వెంటనే అటు వైపు చివరన ఉన్న పార్థసారధి దగ్గరకు వెళ్లి ఆయన చేయి పట్టుకుని మనమంతా ఒకటేనని చేతులు కలిపారు. దీంతో సభలో కురుబ యూత్ ఈలలు కేకలు వేస్తూ హోరెత్తించారు. ఇంత తక్కువ సమయంలోనే నేతల్లో ఇంత మార్పు ఏంటో అంటూ అక్కడున్న వారంతా గుసగుసలాడారు.

Also Read:

TSRTC MD Sajjanar: రక్తదానం చేయడండి.. బస్‌లో ఫ్రీగా ప్రయాణించండి.. రాష్ట్ర వ్యాప్తంగా రేపు శిబిరాలు..

RTC MD Sajjanar: కుటుంబ సభ్యులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. వినూత్నరీతిలో సజ్జనార్‌ ప్రచారం..