Ramana Deekshithulu: పూజ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు.. సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ రమణ దీక్షితుల ట్వీట్
Ramana Deekshithulu:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ట్యాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. ఏప్రిల్‌లో తిరిగి విధుల్లో చేరిన తర్వాత తిరుచానూరు..
Ramana Deekshithulu:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ట్యాగ్ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. ఏప్రిల్‌లో తిరిగి విధుల్లో చేరిన తర్వాత తిరుచానూరు పద్మావతి ఆలయంలోని వంశపారపర్య అర్చకులకు ఇప్పటి వరకు సంభావన ఇవ్వలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వల్ల 2018 నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నామని, మమ్మల్ని గర్భగుడిలోకి వచ్చి పూజ చేయనీకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ సమస్యల నుంచి అర్చకులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం జగన్‌ను ట్విటర్‌లో కోరారు.
కాగా, ప్రధాన అర్చకుడి హోదాలో తిరిగి విధుల్లో చేరారు. మూడేళ్ల క్రితం వయో పరిమితి ముగిసి పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 65ఏ ళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణ చేయాలని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అప్పట్లో టీటీడీతో పాటు గోవింద రాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పదవీ విరమణ వయసు నిండిన అర్చకులందరూ రిటైర్ అయ్యారు. వారిలో రమణ దీక్షితులతో పాటు ఆయా ఆలయాల నుంచి 10 మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ అర్చకులు మరో 10 మంది విధుల నుంచి తప్పుకున్నారు.