Rajahmundry: మరో వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మూసివేత.. మరమ్మతు పనులు పరిశీలించిన ఎంపీ

|

Oct 15, 2022 | 9:40 PM

రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ రోడ్‌వేను అధికారులతో కలిసి పరిశీలించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌. రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ దెబ్బతినకుండా ప్రజలు కూడా సహకరించాలన్నారు దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్‌ఎం శ్రీనివాస్‌. బ్రిడ్జిలకు సమీపంలో ఇసుక తవ్వకాలు జరపొద్దని విజ్ఞప్తి చేశారు.

Rajahmundry: మరో వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మూసివేత.. మరమ్మతు పనులు పరిశీలించిన ఎంపీ
Rajahmundry Road Cum Railwa
Follow us on

రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ మరోసారి క్లోజైంది. మరమ్మతుల కోసం వారం రోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. రోడ్డుమార్గం డామేజ్‌ కావడం, రెయిలింగ్‌ అండ్‌ ఫుట్‌పాత్‌ పూర్తిగా దెబ్బతినడంతో అత్యవసర మరమ్మతులు చేపట్టింది యంత్రాంగం. ఆర్‌అండ్‌బీ రైల్వేశాఖ కలిసి రిపేర్లు చేస్తున్నాయి. రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ రోడ్‌వేను అధికారులతో కలిసి పరిశీలించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌. రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ దెబ్బతినకుండా ప్రజలు కూడా సహకరించాలన్నారు దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్‌ఎం శ్రీనివాస్‌. బ్రిడ్జిలకు సమీపంలో ఇసుక తవ్వకాలు జరపొద్దని విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జికి రెండు వందల మీటర్ల పరిధి వరకు ఇసుక తవ్వొద్దని కోరారు. కొవ్వూరు-రాజమండ్రి మధ్య మరో రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ నిర్మాణం జరిగేవరకు ఇప్పుడున్నదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు దక్షిణమధ్యరైల్వే ఏడీఆర్‌ఎం శ్రీనివాస్‌. రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ మూసివేతతో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు అధికారులు.

కాగా వంతెన క్లోజ్‌ కావడంతో లారీలు, భారీ వాహనాలు, ప్రైవేట్‌ బస్సులు, కమర్షియల్‌ వెహికల్స్‌ను కొవ్వూరు-రాజమండ్రి నాలుగో వంతెన మీదుగా తరలిస్తున్నారు. బైక్స్‌, కార్లు, ఆర్టీసీ బస్సుల ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా అనుమతిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు ఈ రూల్స్‌ని కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు అధికారులు.

మరోవైపు బ్రిడ్జి మూసివేతపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నెల 17న రాజమండ్రి బ్రిడ్జి మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర జరగాల్సి ఉంది. పాదయాత్రను అడ్డుకోవడానికే ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం  క్లిక్ చేయండి..