Anantapuram: అనంతపురం జిల్లాను వీడని వరద కష్టాలు.. ప్రాణాలకు తెగించి నది దాటి మృతదేహనికి అంత్యక్రియలు

|

Dec 02, 2021 | 8:37 AM

Anantapuram Rains: ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు  కురుస్తూనే ఉన్నాయి.  కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లలో గత కొన్ని రోజులుగా..

Anantapuram: అనంతపురం జిల్లాను వీడని వరద కష్టాలు.. ప్రాణాలకు తెగించి నది దాటి మృతదేహనికి అంత్యక్రియలు
Anantapur Rains
Follow us on

Anantapuram Floods: ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు  కురుస్తూనే ఉన్నాయి.  కడప, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లలో గత కొన్ని రోజులుగా వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్త్యవ్యస్థమైంది. జిల్లా ప్రజలను వర్షాలు, వరదల కష్టాలు వీడడంలేదు. పొంగుతున్న వాగులు, వంకలతో జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. నీటి ప్రవాహాలు దాటేందుకు నానా తంటాలు పడుతున్నారు.

జిల్లాలోని పుట్టపర్తిలో అంతిమయాత్రకు నీటి ప్రవాహాల అడ్డంకి ఏర్పడింది. సాయి నగర్ కాలానికి చెందిన వెంకటరాముడు ( 65) అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ గ్రామానికి దళిత స్మశాన వాటిక నది అవతల ఒడ్డున ఉంది. దీంతో గ్రామంలో ఎవరైనా మరణించే వారి అంత్యక్రియల నిమిత్తం మృత దేహాన్ని నది దాటి స్మశాన వాటికకు తీసుకుని వెళ్లేవారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో వెంకటరాముడు భౌతిక కాయానికి బంధువులు ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  వెంకటరాముడు మృతదేహాన్ని తరలించేందుకు  గ్రామస్థులు తాళ్ళు కట్టి వంతెనలా ఏర్పరిచారు. ఆ తాళ్ల సాయంతో నదిని దాటి  మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read:  ఆఫ్రికా ఖండం దాటి 20 దేశాల్లో అడుగు పెట్టిన ఒమిక్రాన్.. ఒక్క యూరోప్‌లోనే 44 కేసులు నమోదు