Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలెర్ట్. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి, ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ ప్రాంతం వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుండి ఈశాన్య రుతుపవనాల వర్షాలు ఆగిపోనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య గాలులు కూడా తక్కువ ఎత్తులో వీస్తున్నాయని పేర్కొంది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతవారణం ఎలా ఉండబోతుందోనన్న వివరాలు వెల్లడించింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఆది, సోమ వారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. ఆది, సోమ వారాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది .
రాయలసీమ : ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
Also Read: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తోన్న వధువును చెంపపై కొట్టిన వరుడు.. ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది