Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

|

Jun 13, 2021 | 10:27 AM

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌,.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
Follow us on

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీనికి తోడు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాలోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా రాగల రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 6 ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ఇక అటు, నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

బిర్యానీ తెచ్చిన తంటాలు.. సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియో వైరల్‌.. ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

A Penny For A House: ఆ పట్టణంలో తగ్గిపోతున్న జనాభా.. రూ.12లకే ఇల్లు అంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. కండిషన్స్ అప్లై