AP Rain Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మూడు రోజులపాటు ఆ ప్రాంతాల్లో వర్షాలు..

|

Jan 27, 2022 | 5:15 PM

AP Weather Alert: మారుతున్న వాతావరణ పరిస్థితులతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి ఓ మోస్తరు

AP Rain Alert: ఏపీ ప్రజలకు అలెర్ట్.. మూడు రోజులపాటు ఆ ప్రాంతాల్లో వర్షాలు..
Rain Alert
Follow us on

AP Weather Report: మారుతున్న వాతావరణ పరిస్థితులతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య గాలులు, తూర్పు గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని వాతవరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా ఆంధ్రా ప్రాంతంలోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని (Rain Alert) అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు వాతవరణ మార్పులు గురించి ప్రకటన చేసింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుంది

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Also Read:

Gudivada Casino: కాకరేపుతున్న గుడివాడ క్యాసినో ఇష్యూ.. నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..

AP Backlog Jobs: నెలకు రూ.92,000ల జీతంతో.. ఆంధ్రప్రదేశ్‌‌లో పలు టీచింగ్ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలివే!