AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gudivada Casino: కాకరేపుతున్న గుడివాడ క్యాసినో ఇష్యూ.. నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..

TDP Leaders Complaint to Governor: గుడివాడ క్యాసినో (Gudivada Casino) సీన్‌తో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. సంక్రాంతి నాటినుంచి

Gudivada Casino: కాకరేపుతున్న గుడివాడ క్యాసినో ఇష్యూ.. నానిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..
Gudivada Casino
Shaik Madar Saheb
|

Updated on: Jan 27, 2022 | 3:01 PM

Share

TDP Leaders Complaint to Governor: గుడివాడ క్యాసినో (Gudivada Casino) సీన్‌తో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. సంక్రాంతి నాటినుంచి టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య క్యాసినో ఘటనపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఘాటుగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడ పర్యటన అనంతరం.. నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కు అందించింది. అనంతరం నిజనిర్ధారణ కమిటీ (TDP Leaders) లోని సభ్యులు గురువారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. క్యాసినో వ్వవహారానికి సంబంధించి కరపత్రాలు, పలు వీడియోలు, నృత్యాలు చేసిన 13 మంది యువతుల జాబితా.. వారు ఎక్కడినుంచి వచ్చారు.. మళ్లీ ఎక్కడికి వెళ్లారు.. సమగ్ర వివరాలను, టికెట్లు బుక్ చేసిన వారి వివరాలను నిజనిర్ధారణ కమిటీ బృందం గవర్నర్‌కు అందజేసింది.

విచారణకు వెళ్లిన సమయంలో తమపై జరిగిన దాడిపై, పోలీసుల వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. అదేవిధంగా కొడాలి నాని (Kodali Nani)ని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు క్యాసినో వ్యవహారంపై చంద్రబాబు రాసిన లేఖను గవర్నర్‌కు అందించినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. క్యాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రలు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, బోండా ఉమా పలువురు నాయకులు ఉన్నారు.

Also Read:

Gudivada Casino Issue: గుడివాడ కేసినో వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి.. గవర్నర్ కు లేఖ రాసిన టీడీపీ అధినేత..

Vizag Steel Recruitment: వైజాగ్ స్టీల్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.?