AP Rain Alert: మరో మూడురోజులు దంచికొట్టుడే.. ఏపీకి మళ్లీ రెయిన్ అలెర్ట్.. వివరాలు

|

Nov 15, 2021 | 2:47 PM

Andhra Pradesh Rain Alert: అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో కోస్తాఆంధ్రా ప్రాంతాల్లో పంటలు

AP Rain Alert: మరో మూడురోజులు దంచికొట్టుడే.. ఏపీకి మళ్లీ రెయిన్ అలెర్ట్.. వివరాలు
Rain Alert
Follow us on

Andhra Pradesh Rain Alert: అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో కోస్తాఆంధ్రా ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. తాజాగా మళ్లీ ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5 .8 కి.మీ ఎత్తు  వరకు వ్యాపించి  ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి , తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద రాగల 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది. ఆ తరువాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణం కొనసాగించి నైరుతి బంగాళాఖాతం వద్దనున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ – ఉత్తర తమిళనాడు తీరానికి సుమారు నవంబర్ 18, 20, 21 వ తేదీన చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన:
ఉత్తర కోస్తాఆంధ్ర, యానాం: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read:

AP Municipal Elections 2021 Live: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. కుప్పంపైనే అందరి ఫోకస్!

Chandrababu Naidu: ఏపీలో ఎన్నికల కమిషన్ ఉందా.. చేతకాక పోతే వెళ్లిపోండి.. ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు