Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

Rain Alert: వర్షాలు ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసి నాలుగైదు రోజుల నుంచి కాస్త విరామం..

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
Andhra Pradesh Rain Alert

Updated on: Sep 26, 2022 | 8:33 AM

Rain Alert: వర్షాలు ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసి నాలుగైదు రోజుల నుంచి కాస్త విరామం ఇచ్చాక.. మళ్లీ ఏపీలో కురుస్తున్నాయి. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అయితే ఇప్పటికే ఏపీలోని రాయలసీమాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. పిడుగులు పడే ప్రాంతాలను అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. అయితే సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి


ఉత్తరాదిలో పలుచోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫిరోజాబాద్‌, ఘజియాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మూడ్రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ఫిరోజాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి