దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ నటి త్రిష తన అందం, ఫిట్నెస్తో ప్రత్యేక గుర్తింపు పొందారు. 40 ఏళ్లు దాటినా కూడా ఆమె యవ్వనంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సహజసిద్ధమైన జీవనశైలిని అనుసరించడం ఆమె అందం రహస్యం. విటమిన్ C పుష్కలంగా ఉన్న పండ్లు, తాజా కూరగాయలు ఆమె ఆహారంలో ముఖ్య భాగం. జుట్టు సంరక్షణకు ఆయిల్ మసాజ్, ఆయుర్వేద సీరమ్ ఉపయోగిస్తారు. ప్రతిరోజూ యోగా, వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉంటారు.