AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సమ్మర్ సెలవుల్లో మరిన్ని స్పెషల్ రైళ్లు..

Railway News/IRCTC:  కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గడంతో మునపటి రైళ్లను ఇప్పటికే పునరుద్ధరించడంతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. సమ్మర్ సెలవుల్లో మరిన్ని స్పెషల్ రైళ్లు..
Summer Holiday Special TrainsImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Apr 16, 2022 | 2:39 PM

Share

Railway News/IRCTC:  కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గడంతో మునపటి రైళ్లను ఇప్పటికే పునరుద్ధరించడంతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. తాజాగా మరిన్ని ప్రత్యేక రైళ్లకు సంబంధించి ద.మ.రైల్వే శాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం(Visakhapatnam) – తిరుపతి (Tirupati) మధ్య 44 వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు ప్రకటించారు.

వీక్లీ ప్రత్యేక రైళ్ల వివరాలు..

వీక్లీ ప్రత్యేక రైలు (నెం.08581) ప్రతి ఆదివారం రాత్రి 11 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలును ఏప్రిల్ 17 నుంచి జూన్ 26 వరకు ప్రతి ఆదివారం నడపనున్నారు. అలాగే మరో వీక్లీ ప్రత్యేక రైలు నెం.08583 ప్రతి సోమవారం సాయంత్రం 7 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.15 గం.లకు తిరుపతి చేరుకోనుంది. ఈ వీక్లీ ప్రత్యేక రైలును ఏప్రిల్ 18వ తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు ప్రతి సోమవారం నడుపుతారు. ఈ వీక్లీ ప్రత్యేక రైళ్లను విశాఖపట్నం నుంచి తిరుపతికి మొత్తం 22 సర్వీసులు నడపనున్నారు.

వీక్లీ ప్రత్యేక రైలు (నెం.08582) ప్రతి సోమవారం రాత్రి 09.55 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ వీక్లీ ప్రత్యేక రైలును ఏప్రిల్ 18 తేదీ నుంచి జూన్ 27వ తేదీ వరకు నడపనున్నారు. అలాగే మరో వీక్లీ ప్రత్యే రైలు (నెం.08584) ప్రతి మంగళవారం రాత్రి 09.55 గం.లకు తిరుపతి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు ప్రతి మంగళవారం ఈ వీక్లీ రైలును నడపనున్నారు. ఈ వీక్లీ ప్రత్యేక రైళ్లను తిరుపతి నుంచి విశాఖపట్నంకు మొత్తం 22 సర్వీసులు నడపనున్నారు.

ఈ వీక్లీ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రత్యేక రైళ్లు 08583/08584 ఇరు మార్గాల్లోనూ అన్నవరం రైల్వేస్టేషన్‌లోనూ ఆగుతుంది.

ప్రత్యేక రైళ్లు 08583/08584లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ప్రత్యేక రైళ్లు 08581/08582లో ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లకు టికెట్ బుకింగ్ ప్రారంభించారు. బుకింగ్ కేంద్రాలతో పాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ప్రయాణీకులు టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

Also Read..

Hanuman Shobha Yatra: కొనసాగుతున్న హనుమాన్‌ శోభయాత్ర.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ వర్సెస్ ఆంధ్రా కేబినెట్.. క్యాస్ట్ ఫార్ములాపై చర్చలు

ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం