
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని ఇడుపులపాయలో ఉన్న ఆర్కే వ్యాలీ హాస్టల్ లో కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లోని బాయ్స్ హాస్టల్ 2లో భారీ కొండచిలువ విద్యార్ది మంచం కింద దాక్కొని ఉంది. మంచం కింద ఉన్న కొండచిలువలను గుర్తించిన విద్యార్థులు త్రిబుల్ ఐటీ అధికారులకు సమాచారం అందించారు. విద్యార్దుల సమాచారంతో త్రిబుల్ ఐటీ అధికారుల సమాచారంతో ఘటనా స్థలం వద్దకు చేరుకున్న వేంపల్లి ఫారెస్ట్ అధికారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొండచిలువను గోని సంచిలో బంధించి ఫారెస్ట్ జీప్ లో తీసుకుపోయి వెళ్ళి అడవిలో వదిలిపెట్టారు.
ఇడుపులపాయ చుట్టుపక్కల అంతా కొండ ప్రాంతం కావడంతో నిత్యం పాములు, కొండచిలువలు హాస్టల్ గదులలో ప్రత్యక్షం అవుతున్నారు. దీంతో విద్యార్దులు ఆందోళనకు గురవుతున్నారు. నిత్యం ఇక్కడ ఇలా జరుగుతుండడంతో స్నేక్ క్యాచర్ ను ఇడుపులపాయ ఆవరణలో ఉంచాలని విద్యార్దులు డిమాండ్ చేస్తున్నారు. తాము నిత్యం పరిసరాలను గమనిస్తున్నామని కనుక ఎటువైపు నుంచి ఆపద వస్తుందో తెలుసుకుంటున్నామని అయితే.. ఎవరూ లేని సమయంలో ఇలా కొండ చిలువ ఇలా గదిలోకి వస్తే.. అప్పుడు ఒంటరిగా ఉంటే ప్రాణాపాయమే అని విద్యార్దులు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..