బ్రదర్‌కు కంగ్రాట్స్ చెప్పిన పూరి

నర్సీపట్నం :ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గానికి వస్తున్న ఉమాశంకర్‌గణేష్‌కు తన సోదరులు పూరీ జగన్నాథ్, సాయిరాంశంకర్‌లు కూడా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. వీరు శుక్రవారం మండలంలోని వెంకన్నపాలెం చేరుకుని గణేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం  కార్యకర్తలు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వీరితో కరచాలనం చేయడంతో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. కాగా ప్రజలు రాజన్న రాజ్యం కోసమే సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి ఉహించని విధంగా భారీ మెజార్టీ ఇచ్చారని సినీ దర్శకుడు పూరీ […]

బ్రదర్‌కు కంగ్రాట్స్ చెప్పిన పూరి

Edited By:

Updated on: May 25, 2019 | 6:26 PM

నర్సీపట్నం :ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గానికి వస్తున్న ఉమాశంకర్‌గణేష్‌కు తన సోదరులు పూరీ జగన్నాథ్, సాయిరాంశంకర్‌లు కూడా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. వీరు శుక్రవారం మండలంలోని వెంకన్నపాలెం చేరుకుని గణేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం  కార్యకర్తలు, అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వీరితో కరచాలనం చేయడంతో పాటు సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. కాగా ప్రజలు రాజన్న రాజ్యం కోసమే సార్వత్రిక ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి ఉహించని విధంగా భారీ మెజార్టీ ఇచ్చారని సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు