AP BJP: ఏపీలో రహదారుల అభివృద్ధి బీజేపీ చలవే.. వైసీపీపై పురంధేశ్వరి ఎటాక్‌

|

Jul 13, 2023 | 1:31 PM

Vijayawada, july 13: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు బయల్దేరిన పురంధేశ్వరి ముందుగా ఎన్టీఆర్ ఘట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం విజయవాడలో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం అయ్యారు

AP BJP: ఏపీలో రహదారుల అభివృద్ధి బీజేపీ చలవే.. వైసీపీపై పురంధేశ్వరి ఎటాక్‌
Purandeshawri
Follow us on

విజయవాడ, జూలై 13: జనసేనతో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు BJP AP అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు బయల్దేరిన పురంధేశ్వరి ముందుగా ఎన్టీఆర్ ఘట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం విజయవాడలో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం అయ్యారు. సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ.. జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటామన్నారు. జనసేన మిత్రపక్షమే అన్నారు. ఒక్క APకే 22 లక్షలకుపైగా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు పురంధేశ్వరి. కానీ ఏపీలో 35 శాతం కూడా ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు పురంధేశ్వరి. పోలవరం విషయంలో కేంద్రం నుంచి సహకారం అందట్లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే.. కేంద్రానికే ఇచ్చేయాలన్నారు పురంధేశ్వరి. రైతులకు 12 వేల రూపాయలు పెట్టుబడి కింద ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు పురంధేశ్వరి. ఇస్తున్నారో.. లేదో సీఎం జగన్‌ చెప్పాలన్నారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ బీజేపీని పూర్తిస్థాయిలో ప్రక్షళన చేసేందుకు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర జట్టును త్వరలోనే ప్రకటిస్తారని చర్చ జరుగుతోంది. ఇందు కోసం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తంఓది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర టీమ్ స్థానంలో మరో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తారని  ప్రచారం కూడా ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం