Pulivendula IIIT: పులివెందుల ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌.. తల్లిదండ్రుల కోసమే స్టూడెంట్ సూసైడ్..

|

Nov 25, 2022 | 6:48 AM

పులివెందుల ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సూసైడ్‌ కేసులో ట్విస్ట్‌. అసలు సూసైడ్‌కు కారణం ఏంటో క్లియర్‌గా లేఖలో రాయడంతో అసలు మేటర్‌ బయటపడింది. సూసైడ్‌ చేసుకున్నది దేనికి..? ఎందుకు..? తల్లితండ్రుల కాపురం కోసం..

Pulivendula IIIT: పులివెందుల ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌.. తల్లిదండ్రుల కోసమే స్టూడెంట్ సూసైడ్..
Pulivendula Iiit
Follow us on

పులివెందుల ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సూసైడ్‌ కేసులో ట్విస్ట్‌. అసలు సూసైడ్‌కు కారణం ఏంటో క్లియర్‌గా లేఖలో రాయడంతో అసలు మేటర్‌ బయటపడింది. సూసైడ్‌ చేసుకున్నది దేనికి..? ఎందుకు..? తల్లితండ్రుల కాపురం కోసం ఆహుతయ్యాడు ఓ విద్యార్థి. పులివెందుల ట్రిపుల్‌ ఐటీలో చదివే విద్యార్థి ఈశ్వర్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. అయితే ఈ సూసైడ్‌ మేటర్‌లో ట్రిపుల్‌ ఐటీ అధికారులు చెప్పిన దానికి, అతని తల్లితండ్రులు చెప్తున్న మాటలకు పొంతన కుదరడం లేదు. కుటుంబ కలహాల వల్లే హాస్టల్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయాడని ట్రిపుల్‌ ఐటీ అధికారులు అంటూ ఉంటే.. కుటుంబంలో కలహాలేం లేవు అని తల్లితండ్రులు చెబుతున్నారు.

అయితే చనిపోయే ముందు ఈశ్వర్‌ రాసిన సూసైడ్‌ లెటర్‌ బయటకొచ్చింది. అందులో అమ్మనాన్న ఇప్పటికైనా మీరు మాట్లాడుకోండి అని రాశాడు. అంటే.. తల్లితండ్రులు కలిసి ఉండటం లేదనే బాధతో తల్లడిల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మృతుడి తల్లితండ్రులు ట్రిపుల్‌ ఐటీ అధికారులపై ఇడుపుల పాయ ఆర్కే వ్యాలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..