Andhra Pradesh: విజయవాడ నుంచి బెంగళూరు వరకు ఆరులైన్ల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయని చెప్పారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇవాళ రాజ్యసభలో ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానంగా చెప్పారు. దీనికి సంబంధించి లిఖిత పూర్వక సమాధానం కూడా చెప్పారు.
విజయవాడ నుంచి కడప, పులివెందుల, కదిరి, ఓబుళదేవరచెరువు, గోరంట్ల మీదుగా బెంగళూరు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందన్న నితిన్ గడ్కరీ.. దీనిపై త్వరలోనే టెండర్లను ఆహ్వానించే అవకాశం ఉందన్నారు. రహదారి నిర్మాణం పూర్తయితే బెంగళూరుకు ప్రయాణించే దూరం, సమయం మరింత తగ్గనుంది.
Also read:
త్రిపురలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ ‘హౌస్ అరెస్ట్’..హోటల్ లో గంటల పాటు నిర్బంధం
‘పోర్న్ క్లిప్స్ తొలగించాలని రాజ్ కుంద్రా కోరేవారు’.. కానీ..కుంద్రా కేసులో ఉద్యోగుల సాక్ష్యం