Chaganti Koteswara rao: వీడిన సందిగ్ధత.. గురజాడ అవార్డు స్వీకరించేందుకు అంగీకరించిన చాగంటి..

|

Nov 30, 2022 | 12:25 PM

ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. గురజాడ అవార్డ్‌ను స్వీకరించేందుకు.. చాగంటి అంగీకరించారు. సాయంత్రం విజయనగరానికి వచ్చి అవార్డ్ తీసుకుంటానంటూ.. గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు సమాచారమిచ్చారు...

Chaganti Koteswara rao: వీడిన సందిగ్ధత.. గురజాడ అవార్డు స్వీకరించేందుకు అంగీకరించిన చాగంటి..
Chaganti Koteswara Rao
Follow us on

ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. గురజాడ అవార్డ్‌ను స్వీకరించేందుకు.. చాగంటి అంగీకరించారు. సాయంత్రం విజయనగరానికి వచ్చి అవార్డ్ తీసుకుంటానంటూ.. గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు సమాచారమిచ్చారు. సాయంత్రం 6 గంటలకు జ్ఞానసరస్వతి ఆలయం ప్రాంగణంలో.. అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. సాహితీ వేత్తలు, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నెలకొనడం తెలిసిందే. గురజాడ విశిష్ట పురస్కారాన్ని చాగంటికి అందించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. చాగంటికి అవార్డు ఇవ్వాలన్న నిర్ణయంపై హేతువాదులు, కవులు, కళాకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురజాడ అప్పారావు తన జీవితకాలం అంతా హేతువాదిగా, అభ్యుదయ వాదిగా ఉన్నారని.. అందుకు భిన్నమైన మార్గంలో సాగుతున్న చాగంటి భగవంతుడి గురించి ప్రవచనాలు చెబుతారని గుర్తు చేశారు. విరుద్ధ వైఖరులతో ఉన్నప్పుడు అవార్డు ఎలా ఇస్తారని, తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పురస్కారాన్ని ప్రదానం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

అయితే బుధవారం కాస్త మెత్తబడిన వారు.. గురజాడ రచనలను, సిద్ధాంతాలను, అభ్యుదయ భావాలను చాగంటి ప్రచారం చేస్తే అవార్డు స్వీకరించడానికి తమకు అభ్యంతరం లేదని అన్నారు. గురజాడ అభ్యుదయ వాదనలను ప్రచారం చేస్తానని చాగంటి అంగీకరించాలని, ఈ మేరకు ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే అవార్డు స్వీకరించాలని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా విజయనగరంలో గురజాడ 107 వ వర్ధంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. గురజాడ ఇంటి నుంచి విగ్రహం వరకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు ర్యాలీ నిర్వహించారు. గురజాడ గేయాలను ఆలపించారు. విశాఖలోనూ గురజాడ వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. అర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గురజాడ అభ్యుదయ భావాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవశ్యకత ఉందని సాహితీ వేత్తలు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..