Andhra: మిర్చినే కాదు.. వేరుశనగ రైతులకు పండగొచ్చింది.. హిస్టరీ క్రియేట్ చేసిన ధర

రాయలసీమలో ముఖ్యమైన మార్కెట్ అయిన ఆదోనిలో వేరు శనగకు రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. ఇప్పటికీ వేరుశనగ పంట రాయలసీమలో ప్రధాన పంటగా కొనసాగుతోంది, కాగా గత కొన్నేళ్లుగా రైతులు ధర లేక నష్టపోతున్నారు. అయితే, ఈ ఏడాది ధరలు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Andhra: మిర్చినే కాదు.. వేరుశనగ రైతులకు పండగొచ్చింది.. హిస్టరీ క్రియేట్ చేసిన ధర
Groundnut Price

Edited By:

Updated on: Jan 24, 2026 | 5:56 PM

ఎండు మిర్చి ధర పైపైకి దూసుకుపోతుంది. గత ఏడాది ధర లేక నష్టపోయిన రైతులు..  ఈసారి ధరలు ఆశాజనకంగా ఉన్నాయని చెబుతున్నారు. అదే రూట్‌లో వేరుశనగ కూడా పరుగులు పెడుతుంది. మార్కెట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ధర నమోదయింది. రాయలసీమలో ప్రధాన మార్కెట్లలో అగ్రగామిగా ఉన్న ఆదోని మార్కెట్లో టాప్ రేటు నమోదయింది. రాయలసీమ జిల్లాల్లో వేరుశెనగ ప్రధాన పంట. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఉన్నట్లుండి ధర ఎగబాకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రికార్డు స్థాయిలో క్వింటాల్ ధర 9,652 పలికింది. బోరు బావులు, కాలువల కింద సాగుచేసిన వేరుశనగ ఇప్పుడిప్పుడే రైతులకు చేతికి రావడంతో విక్రయానికి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆదోని మార్కెట్లో ధరలు రికార్డు స్థాయిలో పలుకుతుండటంతో పెద్ద ఎత్తున పంట విక్రయానికి వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో నూనె గింజలకు డిమాండ్ పెరగడంతో వేరుశనగ పంటకు కూడా డిమాండ్ పెరిగినట్లుగా వ్యాపారులు చెప్తున్నారు. 1247 బస్తాలు శుక్రవారం ఒక్కరోజే ఎకరాయానికి రాగా వాటి కనిష్ట ధర రూ.6379 కాదా.. మీడియం ధర రూ.8440 పలికింది. ఇక గరిష్టం రూ.9652గా నమోదయింది. దీంతో వేరుశనగ రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా లేక నిలకడగా ఉంటాయా అనేది ప్రశ్నార్థకం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి