President of India: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన చిత్తూరుకు రాష్ట్రపతి రానున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ అధికారులు ధృవీకరించారు. ఫిబ్రవరి 7వ తేదీన చిత్తూరులోని సదుం మండలం పీపుల్స్ గ్రోవ్ స్కూల్‌లో పర్యటిస్తారని అధికారులు చెప్పారు. అలాగే.. మదనపల్లిలోని పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత ముంతాజ్ అలీ ఉన్న సత్ సంఘ్ ఆశ్రమాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సందర్శించనున్నారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇవాళ మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, సబ్ కలెక్టర్ జాహ్నవి, డీఎస్పీ రవి మనోహరాచారి సత్ సంఘ్ ఆశ్రమాన్ని పరిశీలించారు. రాష్ట్రపతి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.
Also read:
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతం.. తొలి రోజు 3,530 మందికి టీకా అందించామన్న హెల్త్ డైరెక్టర్