Prakasam district police: మ్యాట్రిమోని సైట్‌ల (matrimonial sites)లో చూస్తారు.. ఆ తర్వాత వారికి నచ్చిన వారికి ఫోన్లు చేసి.. ప్రేమ, పెళ్లి అంటూ మహిళలకు వేస్తారు. ఆ తర్వాత సన్నిహితంగా ఉంటూ డబ్బులు దండుకుంటుంటారు.. ఇలాంటి కేసులు నిత్యం కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఆకతాయిలతో జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఓ సంఘటన తాజాగా మరొకటి ఆంధ్రప్రదేశ్ (AP) లోని ప్రకాశం జిల్లా (prakasam district) లో వెలుగులోకి వచ్చింది. మాట్రిమోని సైట్‌లతో అమాయక ఆడవాళ్ళను మోసం చేసిన ఘరానా సైబర్ మోసగాడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్పందనలో మద్దిపాడుకు చెందిన ఓ భాదితురాలు ఫిర్యాదుతో ఘరానా మోసగాడి చరిత్ర వెలుగులోకి వచ్చింది. యువతి ఫిర్యాదు అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు కాకినాడకు చెందిన నిందితుడు పొట్లూరి శ్రీ బాల వంశీకృష్ణ అలియాస్ ప్రతాపనేని రాజేష్ కుమార్‌ను అరెస్టు చేశారు.
పొట్లూరి శ్రీ బాల వంశీకృష్ణ వ్యసనాలకు బానిస కావడంతో ఉద్యోగం కోల్పోయాడని.. ఆ తర్వాత కట్టుకున్న భార్య విడాకులు తీసుకోవడంతో యూట్యూబ్ లో చూస్తూ సైబర్ నేరాలవైపు ఆకర్షితుడైనట్లు పోలీసులు తెలిపారు. బాల వంశీకృష్ణను కాకినాడలో అదుపులోకి తీసుకున్నట్లు మద్దిపాడు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 8 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శంశీకృష్ణపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: