ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి శాఖలు కేటాయించారు. మహిళా మంత్రి వంగలపూడి అనితకు హోం అఫైర్స్, విపత్తు శాఖ కేటాయించారు. మరి పవన్ కల్యాణ్, నారా లోకేశ్.. మిగిలిన ఇతర మంత్రులకు ఏయే శాఖలు కేటాయించారో తెలుసుకుందాం పదండి...
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం కూడా కంప్లీట్ అయింది. తాజాగా కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. 24మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు దిగువన చూడండి
చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, జీఏడీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు)
కొణిదెల పవన్ కళ్యాణ్ (ఉప ముఖ్యమంత్రి) – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్‌టీజీ