
దానిమ్మ పంటకు రికార్డు స్థాయి ధర పలుకుతోంది. దానిమ్మ పండ్లు అంటే అందరికీ ఇష్టమే. ఆయుర్వేదంలో కూడా దానిమ్మకు మంచి గుర్తింపు ఉంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడంతో పాటు కొన్ని రకాల వ్యాధులను నియంత్రణలో పెడుతుంది అనేది ప్రచారం. అలాంటి దానిమ్మ పంటకు మూడు నెలల క్రితం ధర లేదు. టన్ను కేవలం రూ. 50 వేలు మాత్రమే పలికేది. ఇప్పుడు పరిస్థితి మారింది క్రమంగా ధర పెరుగుతూ వస్తుంది. ఎంతగా అంటే రికార్డులు దాటే స్థాయికి చేరుకుంది.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో దిగుబడులు ఆలస్యం కావడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లుగా వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యతను బట్టి దానిమ్మ పంటను టన్ను రూ. 2 లక్షల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడు నెలల క్రితం టన్ను రూ. 50 వేలు ఉన్న దానిమ్మ నెల రోజుల క్రితం రూ. లక్ష నుంచి రూ. లక్ష పదివేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం రూ. రెండు లక్షల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15500 హెక్టార్లలో ఈ దానిమ్మ పంట సాగు చేస్తున్నారు రైతులు.
ఇది చదవండి: ఏడాది పొడవునా డబ్బే డబ్బు.! ఎవర్‌గ్రీన్ బిజినెస్‌లు.. ఇప్పుడు వీటికే డిమాండ్
మెజారిటీ శాతం రాయలసీమ జిల్లాలలోనే పండిస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలో ఈ దానిమ్మ సాగు అత్యధికంగా ఉంది. స్థానికంగా ఫ్రూట్ కవర్స్, ప్లాంట్ కవర్స్ విధానంతో దానిమ్మ పండ్ల నాణ్యత పెరిగిందని అధికారులు చెబుతున్నారు, అయితే ఈ ధర ఎంతవరకు ఉంటుంది. కంటిన్యూ అవుతుందా.. లేదా తగ్గుతుందా.. అనేదానిపై దానిమ్మ రైతులలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం తమ పంటలు అమ్ముకుంటున్న దానిమ్మ రైతుల కష్టాలు దాదాపు తీరినట్లే.
ఇది చదవండి: పరిటాల రవిని చంపిన మొద్దు శీను అవ్వాలనుకున్నది ఇదే.. కానీ చివరికి.!