AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP Vs TDP: టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం.. రాళ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు.. 17 మందికి గాయాలు

YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రెండేళ్లకు ముందుగానే ఎన్నికల హీట్ (Political Heat) మొదలైంది. అధికార  వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య  మాటల యుద్ధం..

YCP Vs TDP: టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం.. రాళ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు.. 17 మందికి గాయాలు
Tdp Vs Ycp
Surya Kala
|

Updated on: Apr 07, 2022 | 12:19 PM

Share

YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రెండేళ్లకు ముందుగానే ఎన్నికల హీట్ (Political Heat) మొదలైంది. అధికార  వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య  మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. మరోవైపు గ్రామాల్లో అధికార, ప్రతిపక్షాల కార్యకర్తల మధ్య మాటల దాడి నుంచి ఒకరి పై ఒకరు దాడి చేసుకునే వరకూ చేరుకున్నాయి రాజకీయ కక్షలు. తాజాగా గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లవర్షం కురిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…

జిల్లాలోని శావల్యాపురం మండలం కారుమంచి లో అధికార పార్టీ వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య  తిరునాళ్ల సందర్భంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం తీవ్ర రూపం దాల్చి..  ఈరోజు ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాల వారు ఒకరినొకరు  కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరువర్గాల కార్యకర్తలు గాయపడ్డారు.  సుమారు 17మంది గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో కారుమంచి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తిత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి చికిత్స నిమిత్త తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాదు గ్రామంలోని ఇరువర్గాల మధ్య సయోధ్యకు కుదిర్చి.. వివాదానికి చెక్ పెట్టె దిశగా పోలీసులు ప్రయత్నం చేస్తోన్నట్లు తెలుస్తోంది.

Also Read: Pawan Kalyan-Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ కష్టాలు.. లీకైన ఎక్స్‌క్లూజీవ్ విజువల్స్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే..

Shocking: జాంబీ టెర్రర్.. తోటి జింకలను చంపి తింటున్న వైరస్ సోకిన జింకలు..