CM Jagan: వాలంటీర్లది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ.. గ్రామాల్లో సచివాలయం వంటి వ్యవస్థ నడుస్తోందిః సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలని స్వప్నాన్ని చూశాం.. ఇందులో భాగంగా రాష్ట్రంలో గొప్ప వ్యవస్థ నడుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని గ్రామ వలంటీర్‌ వ్యవస్థ వైపు.. ఇప్పుడు దేశం మొత్తం చూడడం గర్వంగా ఉందన్నారు.

CM Jagan: వాలంటీర్లది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ.. గ్రామాల్లో సచివాలయం వంటి వ్యవస్థ నడుస్తోందిః సీఎం జగన్
Cm Ys Jagan
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 07, 2022 | 1:36 PM

CM YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలని స్వప్నాన్ని చూశాం.. ఇందులో భాగంగా రాష్ట్రంలో గొప్ప వ్యవస్థ నడుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని గ్రామ వలంటీర్‌(Grama Volunteers) వ్యవస్థ వైపు.. ఇప్పుడు దేశం మొత్తం చూడడం గర్వంగా ఉందన్నారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమ సభలో పాల్గొని.. అత్యుత్తమ సేవల అందించినవారికి ప్రోత్సాహంగా సన్మానించారు. అవార్డుతో పాటు నగదు బహుమతిని అందించారు సీఎం జగన్.

కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా.. అందునా జిల్లా కేంద్రం నరసరావుపేట నుంచి వలంటీర్‌ వ్యవస్థ అనే సేవా భావానికి సెల్యూట్‌ చేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌. వివక్ష, అవినీతిలకు తావులేకుండా, కులమతరాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామన్నారు. రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని ప్రశంసించారు. వలంటీర్‌ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని సీఎం స్పష్టం చేశారు. లాభాన్ని పట్టించుకోకుండా.. సేవే పరమావధిగా వలంటీర్లు ముందుకు సాగుతున్నారంటూ సీఎం జగన్‌ గుర్తు చేశారు. ఎంత వస్తుందని లెక్క వేసుకోకుండా.. ఎంత సేవ చేస్తున్నామనే వాలంటీర్లు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న మహా సైన్యనానికి సెల్యూట్ అంటూ.. సచివాలయం వంటి గొప్ప వ్యవస్థ రాష్ట్రంలో నడుస్తోందని సీఎం జగన్ ప్రశంసించారు.

వలంటీర్‌ వ్యవస్థ ద్వారా 33 రకాల సేవలను ప్రతీ ఇంటికి అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది వలంటీర్లు.. లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు సీఎం జగన్‌. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని, వలంటీర్లు అంటే గొప్ప సైనికులు, గొప్ప సేవకులని ప్రశంసలు గుప్పించారు. ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం తరపున చిరుసత్కారం అందజేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్‌ జగన్‌. దిశ వంటి చట్టాలు, దిశ యాప్ ల వలన ఫోన్ పట్టుకొని చెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ గురించి ప్రజలకు వాలంటీర్లు వివరిస్తున్నారు. ప్రభుత్వ అందించే పథకం ప్రజలకు చేరువవుతుందన్నారు. దేశమే మన సేవల్ని అభినందిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న చిరు సత్కారం ఈ రోజు నుండి మొదలవుతుందని సీఎం తెలిపారు. వాలంటీర్లు ఉద్యోగం కాదు.. గొప్ప సేవ చేస్తున్నారు. సేవలకు ప్రోత్సాహంగా సన్మాన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. సేవా మిత్ర కింద పదివేలు, సేవా రత్న కింద ఇరవై వేలు, సేవా వజ్ర కింద ముప్పై వేల నగదు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.