AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.33 లక్షల విలువైన 13.5 కిలోల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వెండి తరలింపుకు సంబంధించిన బిల్లులు, ధ్రువీకరణ పత్రాలు చూపించలేకపోవడంతో ఎమ్మిగనూరుకు చెందిన ఇద్దరు వెండి వ్యాపారులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Kurnool: స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
Silver
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jun 28, 2026 | 9:01 AM

Share

కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన సాధారణ వాహన తనిఖీలు భారీ వెండి పట్టివేతకు దారితీశాయి. తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ స్కూటీని ఆపి పరిశీలించగా, అందులో సుమారు 13.5 కిలోల వెండి బిస్కెట్లు ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. విలువ సుమారు రూ.33 లక్షలు ఉంటుంది..  వాటికి సంబంధించిన సరైన పత్రాలు చూపించలేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ షాకీర్, అక్షయ్ జాదవ్ వెండి వ్యాపారులు. ఆదోనిలో వెండి క్రయవిక్రయాలు ముగించుకుని తిరిగి ఎమ్మిగనూరుకు స్కూటీపై వెళ్తుండగా పట్టణ శివారులో పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో చిక్కారు. స్కూటీలో ఉన్న వెండి బిస్కెట్ల గురించి ప్రశ్నించగా, వాటిని ఎక్కడ కొనుగోలు చేశారో, ఎవరి వద్ద నుంచి తీసుకున్నారో చెప్పలేకపోయారు. అంతేకాకుండా వెండి కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇన్వాయిస్‌లు లేదా ఇతర ధ్రువీకరణ పత్రాలను కూడా చూపించలేదు. దీంతో వెండి తరలింపుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్ల బరువు 13.5 కిలోలు కాగా, వాటి విలువ సుమారు రూ.33 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అలాగే నిందితుల వద్ద ఉన్న స్కూటీతో పాటు రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో వెండి తరలింపుకు సంబంధించిన స్పష్టమైన వివరాలు లభించకపోవడంతో, దీని వెనుక పెద్ద స్థాయిలో అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్లు, ఇతర ఆధారాలను తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులకు అప్పగించనున్నట్లు ఆదోని సీఐ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే