Andhra Pradesh: ఆళ్లగడ్డలో హై టెన్షన్.. నంద్యాల గాంధీ చౌక్ కు రావాలని రవికి భూమా అఖిల సవాల్..

|

Feb 04, 2023 | 9:35 PM

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తోందని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులు కల్పించలేదన్న ఆమె..

Andhra Pradesh: ఆళ్లగడ్డలో హై టెన్షన్.. నంద్యాల గాంధీ చౌక్ కు రావాలని రవికి భూమా అఖిల సవాల్..
Bhuma Akhila Priya
Follow us on

టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తోందని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులు కల్పించలేదన్న ఆమె.. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రకు ఎందుకు ఇబ్బందులు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. లోకేశ్ యాత్రలో జనం లేకపోతే ఎందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే శిల్పా రవి తమ తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడారని.. తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అఖిలప్రియ వెల్లడించిన విషయం తెలిసిందే. నంద్యాల గాంధీ చౌక్‌ వద్దకు వస్తే ఆధారాలు బహిర్గతం చేస్తానని.. అక్కడికి రావాలంటూ రవిచంద్రకిశోర్‌రెడ్డికి ఆమె సవాల్‌ విసిరారు.

రైతు నగరం బైపాస్ రోడ్ లో రూ.200 కోట్లు స్కాం చేశారు. బైపాస్ వస్తుందని తెలిసి భారీగా 50 ఎకరాల భూములు కొన్నారు. ఆ భూములు మీ కుటుంబీకుల పేర్లపై లేవా?. నంద్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని తెలిసి తమ భూముల పక్కనే నిర్మిస్తున్నారు. రూ.5 లక్షలు ఎకరా ఉన్న భూమి రూ.10 కోట్లకు పెరిగింది. శిల్ప సేవా సహాకర్, శిల్ప రైతు సహాకార్ పేరుతో 20 షాపులు తీసుకున్నారు. సీఎం జగన్ కు రవిపై ప్రేమ ఉంటే మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు.

       – భూమా అఖిలప్రియ, మాజీ మంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమా అఖిలప్రియను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆళ్లగడ్డ నుంచి నంద్యాల గాంధీచౌక్‌ వెళ్లేందుకు అఖిలప్రియ సిద్ధమయ్యారు. ఆమె వెళ్లడం ద్వారా నంద్యాలలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడతాయన్న అనుమానంతో ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తన సిబ్బందితో ఆళ్లగడ్డలోని అఖిలప్రియ నివాసానికి వెళ్లి గృహ నిర్బంధం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..