Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత.. టీడీపీ నేతలు హౌస్ అరెస్టు..

|

Sep 09, 2023 | 8:42 AM

ఏపీలో చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. చంద్రబాబు అరెస్టుతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు ఈ విధంగా ముందస్తు చర్యలు చేపట్టారు. అలాగే ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరో వైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నారా లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. కొనసీమ జిల్లా పొడలాడ శుభం గార్డెన్ దగ్గర లోకేష్ నిరసనకు దిగారు. ఏకంగా కింద కూర్చోనే ఆయన ఆందోలన తెలిపారు.

Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత.. టీడీపీ నేతలు హౌస్ అరెస్టు..
Telugu Desam Party
Follow us on

ఏపీలో చంద్రబాబు నాయుడ్ని అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. చంద్రబాబు అరెస్టుతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు ఈ విధంగా ముందస్తు చర్యలు చేపట్టారు. అలాగే ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరో వైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నారా లోకేష్ నిరసన వ్యక్తం చేశారు. కొనసీమ జిల్లా పొడలాడ శుభం గార్డెన్ దగ్గర లోకేష్ నిరసనకు దిగారు. ఏకంగా కింద కూర్చోనే ఆయన ఆందోలన తెలిపారు. అయితే ఆ శుభం గార్డెన్ పరిసరాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే రాజోలు సీఐ గోవిందరాజు, లోకేష్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నా వెంట నాయకులు ఎవరూ రావడం లేదని.. కేవలం కుటుంబ సభ్యుడిగా మాత్రమే ఒక్కడిగా వెళ్తున్నానని అన్నారు.

నన్ను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముదే లోకేష్ కూర్చొని ఆందోళన తెలిపారు. మరోవైపు మీడియాను కూడా లోకేష్ బస చేసినటువంటి ప్రాంతానికి రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టు సమయంలో చంద్రబాబు నాయుడితో సహా ఆయన లాయర్లు, సీఐడీ అధికారుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎఎఫ్‌ఆర్ నమోదు చేయలేదని.. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్‌లో నా పేరు ఎక్కడ ఉందో చూపించాలని చంద్రబాబు నాయుడు అధికారుల్ని అడిగారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు.

ఒకవేళ ఆధారాలు ఉంటే ఉరి తీయండని వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబు విజయవాడ వెళ్లేలోపు రిమాండ్ రిపోర్డ్ అందిస్తామని.. అన్ని విషయాలు కూడా ఈ రిమాండ్ రిపోర్టులో వస్తాయని.. ఏపీ సీఐడీ అధికారులు చెప్పారు. అయితే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాపరని.. సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారని.. అరెస్టుకు ముందు అన్ని వివరాలు చెప్పాలని చంద్రబాబు నాయుడు లాయర్లు పట్టుబట్టారు. అయితే చంద్రబాబు పాత్ర ఉన్నట్లు హైకోర్టుకు చెప్పామని సీఐడీ పోలీసులు తెలిపారు. మరోవైపు నా హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారని.. నన్ను ఎందుకు రిమాండ్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు నాయుడు అన్నారు. మాకు అరెస్టు చేసిన తర్వాత 24 గంటల వరకు సమయం ఉందని.. చంద్రబాబుని ప్రశ్నించిన తర్వాత పూర్తి రిమాండ్ రిపోర్టు ఇస్తామని సీఐడీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..